- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Super Vasuki: వామ్మో ఇది రైలా.. భారీ అనకొండ? ‘సూపర్ వాసుకి’ గూడ్స్ ట్రైన్ పొడవు 3.5 కిలోమీటర్లు
సాధారణంగా ఓ గూడ్స్ రైలుకు దాదాపు 30 నుంచి 60 బోగీల వరకు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ రైలుకు ఏకంగా 295 బోగీలు ఉన్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: సాధారణంగా ఓ (goods train) గూడ్స్ రైలుకు దాదాపు 30 నుంచి 60 బోగీల వరకు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ రైలుకు ఏకంగా 295 బోగీలు ఉన్నాయి. ఇంత పెద్ద గూడ్స్‌రైలు మన దేశంలోనే అతి పెద్ద పొడవైన రైలు ఇది. "సూపర్ వాసుకి" (Super Vasuki) పేరుతో పిలిచే ఈ గూడ్స్ రైలు సుమారు 3.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ రైల్లో మొత్తం 295 కార్గో పెట్టెలను అమర్చారు. మరి ఈ భారీ రైలును లాగేందుకు 6 లోకోమోటివ్ ఇంజిన్‌లు పని చేస్తాయి. దీన్ని బొగ్గు రవాణాకు ఉపయోగిస్తున్నారు. సుమారు 27 వేల టన్నుల సరుకు రవాణా చేయగలదని సమాచారం. స్టేషన్ వద్ద ఈ రైలు వచ్చిందంటే స్టేషన్ దాటడానికి దాదాపు గంట సమయం పడుతుంది. ఈ రైలు చత్తీస్‌గఢ్ కోర్బా నుంచి నాగ్‌పూర్‌లోని రాజ్‌నంద్‌గావ్ వరకు బొగ్గును తీసుకెళ్తుంది.
శివుని మెడలో ఉండే సర్పం పేరు వాసుకి.. వాసుకిని పాముల రాజుగా పిలుస్తారు. ఆ సర్పం పేరునే ఈ రైలుకు పెట్టడం గమనార్హం. దేవతలు, రాక్షసుల మధ్య క్షీర సాగర మథనానికి తాడుకు బదులుగా వాసుకిని ఉపయోగించారు. ఈ రైలు కూడా మలుపుల వద్ద పాములా కనిపిస్తుందని ఆ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ రైలును చూసిన ప్రతి ఒక్కరు వామ్మో ఇది రైలా.. అనకొండ అని అభిప్రాయపడుతున్నారు. ఈ రైలుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇలాంటి ఐడియాలు ఇచ్చే ఇంజనీర్లు ఇప్పుడు మన దేశానికి అవసరమని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు.






