- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > Sunetra Pawar: మహారాష్ట్రకు తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం.. ఎందుకింత హడావుడి అంటే?
Sunetra Pawar: మహారాష్ట్రకు తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం.. ఎందుకింత హడావుడి అంటే?
by Prasad Jukanti |
మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త చరిత్ర మొదలైంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. మహారాష్ట్రకు తొలి మహిళ ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ (62) (Sunetra Pawar) ప్రమాణ స్వీకారం చేశారు. కొద్ది సేపటి క్రితం లోక్ భవన్ లో సునేత్ర పవార్ తో గవర్నర్ ఆచర్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం దేవెంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. అంతకు ముందు ఇవాళ ఎన్సీపీ శాసనసభా పక్ష నాయకురాలిగా సునేత్రా పవార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె పేరును పార్టీ నాయకుడు ఛగన్ భుజ్‍బల్ ప్రతిపాదించగా దిలీప్ పాటిల్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలు బలపరిచారు. ఈ నిర్ణయాన్ని తెలియజేస్తూ సీఎం ఫడ్నవీస్ కు ఒక లేఖ పంపించారు. ఆ తర్వాత సీఎం ఆ లేఖను గవర్నర్ కు పంపారు.
ఎందుకీ హడావుడి?:
గత బుధవారం ఉదయం NCP అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణించిన మూడు రోజులకే ఆయన భార్య సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఓ వైపు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న పరిస్థితుల్లో అజిత్ పవార్ రాజకీయ వారసత్వాన్ని నిర్ణయించడంలో ఇంత తొందరపడటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా భర్తను కోల్పోయిన బాధలో ఉన్న సునేత్ర ఇంత హడావుడిగా పార్టీ శాసనసభా పక్ష బాధ్యతలు, డిప్యూసీ సీఎం (Maharashtra Deputy Chief Minister) బాధ్యతలు స్వీకరించడం చర్చనీయాశంగా మారాయి. అయితే ఈ విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వెనుక రాజకీయ పరంగా అజిత్ పవార్ ఆందోళన ఉన్నట్లు తెలుస్తోంది.
శరత్ పవార్ ఎన్సీపీలోని రెండు వర్గాలు విలీనం జరగాలని అజిత్ పవార్ కోరుకున్నారనే వాదనను శరత్ పవార్ వర్గం తెరమీదకు తీసుకువచ్చింది. అయితే అజిత్ పవార్ రాజకీయ వారసత్వం విషయంలో ఆలస్యం జరిగితే శరద్ పవార్ NCP అజిత్ పవార్ పార్టీ విలీనం విషయంలో వాదనలు, నిర్ణయాలు బలపడే అవకాశం ఉంది. విలీనమే జరిగితే పార్టీలో తిరిగి శరద్ పవార్ వర్గం ఆధిపత్యం చెలాయిస్తుందని తద్వారా వారి స్వంత ప్రభావం తగ్గుతుందని అజిత్ పవార్ శిబిరంలోని ప్రముఖులు భయపడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అజిత్ పవార్ వారసురాలిగా ఆయన సతీమణికే సర్వాధికారాలు కట్టబెట్టి ఇంత హడావుడిగా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారనే టాక్ వినిపిస్తోంది. అయితే డిప్యూటీ సీఎంగా సునేత్ర ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో రెండు వర్గాల విలీనం విషయంలో ఏం జరగబోతోంది అనేది ఆసక్తి రేపుతున్నది.
Next Story






