- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సునేత్రా పవార్ ఆల్‌టైమ్ రికార్డ్.. దేశంలోనే బిగ్ మెజారిటీతో సరికొత్త చరిత్ర!
మహారాష్ట్ర బారామతి ఉప ఎన్నికల్లో సునేత్రా పవార్ సరికొత్త రికార్డు సృష్టించారు.

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర (Maharashtra) గడ్డపై సరికొత్త రికార్డు క్రియేట్ అయింది. పవార్ కుటుంబం తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన బై ఎలక్షన్‌లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అభ్యర్థి, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్రా పవార్ (Sunetra Pawar) తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. ఏకంగా 2,18,034 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొంది, భారతదేశ ఎన్నికల చరిత్రలో అసెంబ్లీ స్థానానికి అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా ఆమె రికార్డు సృష్టించారు.
పాత రికార్డులన్నీ బ్రేక్..
సునేత్రా పవార్ సాధించిన ఈ విజయం గతంలో ఉన్న జాతీయ రికార్డులను తుడిచిపెట్టేసింది. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సాహిబాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి సునీల్ కుమార్ శర్మ సాధించిన 2.14 లక్షల ఓట్ల మెజారిటీ రికార్డును సునేత్రా పవార్ బ్రేక్ చేశారు. గతంలో అజిత్ పవార్ (Ajit Pawar) 2019లో సాధించిన 1.65 లక్షల ఓట్ల మెజారిటీని కూడా ఆమె దాటేశారు. అయితే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ 2026 జనవరిలో జరిగిన విమాన ప్రమాదంలో అకాల మరణం చెందడంతో బారామతి స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఆయన సతీమణి సునేత్రా పవార్ బరిలోకి దిగి అద్భుత విజయాన్ని సాధించారు.






