- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sukhbir Badal: పాత్రలు కడిగిన సుఖ్‌బీర్ సింగ్.. ఐదో రోజూ సేవాదార్‌గా విధులు
శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) నేత, పంజాబ్ మాజీ ఉపముఖ్య మంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ వరుసగా ఐదోరోజూ సేవాదార్ విధులు నిర్వహించారు.

దిశ, నేషనల్ బ్యూరో: శిరోమణి అకాలీదళ్(SAD) నేత, పంజాబ్ మాజీ ఉపముఖ్య మంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ (Sukhbheer singh badhal) వరుసగా ఐదోరోజూ సేవాదార్ విధులు నిర్వహించారు. శనివారం ఉదయం భారీ భద్రత మధ్య రూప్‌నగర్ (Roop nagar) జిల్లాలోని తఖ్త్ కేస్‌గఢ్ సాహిబ్ (Thakth kesgad sahib)కు చేరుకున్న ఆయన కీర్తనలు వింటూ కమ్యూనిటీ కిచెన్‌లో పాత్రలు కడిగారు. అనంతరం గురుద్వారా ప్రవేశద్వారం వద్ద ఒక చేతిలో ఈటె పట్టుకుని కాసేపు కూర్చున్నాడు. సిక్కుల అత్యున్నత తాత్కాలిక సంస్థ అయిన అకల్ తఖ్త్ (Akalthakth) ద్వారా మతపరమైన శిక్షను అనుభవిస్తున్న ఇతర పార్టీ నాయకులు కూడా గురుద్వారాలో పనులు చేశారు. కాగా, 2007 నుంచి 2017 వరకు పంజాబ్‌లో ఎస్ఏడీ ప్రభుత్వం చేసిన తప్పులకు గాను అకల్ తఖ్త్ శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాదల్ శిక్ష అనుభవిస్తున్నారు. అంతకుముందు ఆయన అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ (Golden Temple)లో పలు పనులు చేశారు.






