Eknath Shinde : జ్వరం, గొంతునొప్పితో భాదపడుతున్న ఏక్ నాథ్ షిండే

by Shamantha N |
Eknath Shinde : జ్వరం, గొంతునొప్పితో భాదపడుతున్న ఏక్ నాథ్ షిండే
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి(caretaker Chief Minister of Maharashtra) ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) గత రెండు రోజులుగా జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని షిండే ఫ్యామిలీ డాక్టర్ ఆర్ఎం పాత్రే తెలిపారు. సతారా జిల్లాలోని అతని స్వగ్రామంలో ముగ్గురు నుంచి నలుగురు వైద్యుల బృందం ఏకనాథ్ షిండేకు చికిత్స చేస్తోందని పాత్రే పేర్కొన్నారు. "షిండే ప్రస్తుతం బాగానే ఉన్నారు. గత రెండు రోజులుగా జ్వరం, బాడీ పెయిన్స్, గొంతు ఇన్ఫెక్షన్, జలుబుతో బాధపడుతున్నారు. మేం యాంటీబయాటిక్స్ ఇచ్చాం. ముగ్గురు నుండి నలుగురు వైద్యుల బృందం ట్రీట్మెంట్ చేస్తోంది." అని పాత్రే తెలిపారు.

డిసెంబర్ 5న కొత్త ప్రభుత్వం

ఇకపోతే, మహారాష్ట్రలో డిసెంబరు 5వ తేదీన కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఆజాద్‌ మైదానంలో ఆరోజు సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) సహా ఎన్డీయే ప్రముఖులు హాజరవుతారు. ఈ విషయాన్ని శనివారం బీజేపీ మహారాష్ట్రశాఖ వెల్లడించింది. అయితే ఇప్పటిదాకా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆ పార్టీ ప్రకటించకపోవడం గమనార్హం. పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ రేసులో ముందున్నారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం డిసెంబరు 2న జరుగుతుందని, ఆరోజు కొత్త నేతను ఎన్నుకుంటామని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. మరోవైపు బీజేపీ నేతే ముఖ్యమంత్రిగా ఉంటారని ఎన్సీపీ అధినేత అజిత్‌ పవార్‌ వెల్లడించారు. సీఎం రేసులో తన పేరు ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా కల్పితమని కేంద్ర మంత్రి మురళీధర్‌ మోహోల్‌ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed