- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amit Shah: కేజ్రీవాల్ రాజీనామా చేసి ఉంటే ఈ బిల్లు అవసరం ఉండేది కాదు
కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే, రాష్ట్రాన్ని పాలించారు.

దిశ, నేషనల్ బ్యూరో: నేరం చేసిన రాజకీయ నేతలను పదవి నుంచి తొలగించే బిల్లులపై ప్రతిపక్షాలు వ్యతిరేకించడంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అమిత్ షా తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన 79 ఏళ్లలో ఇటువంటి బిల్లు రాలేదు. ఈ చట్టం అవసరమని చెప్పేందుకు ఇటీవలి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారం ఉదాహరణ. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే, రాష్ట్రాన్ని పాలించారు. జైల్లో ఉండి ప్రభుత్వాన్ని నడిపే ముఖ్యమంత్రి దేశానికి అవసరమా? ఇందులో నైతికత ఎక్కడుంది? కాబట్టి రాజ్యాంగాన్ని మార్చాలా వద్దా? ఆరోజున కేజ్రీవాల్ రాజీనామా చేసి ఉంటే, నేడు ఈ బిల్లు అవసరం ఉండేది కాదని అన్నారు. గతంలోనూ ఢిల్లీని బీజేపీ పాలించింది, కానీ ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదని అమిత్ షా పేర్కొన్నారు.
ఇదే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పదవి కోసం ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థిగా ఉన్న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డిపై అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన 'నక్సలిజానికి మద్దతు ఇస్తున్నారని' ఆరోపించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి 2011 నాటి సల్వా జుడుం తీర్పును ప్రస్తావిస్తూ.. ఆ తీర్పు ద్వారా నక్సలిజానికి పరోక్షంగా ఊతమిచ్చారని, ఆయన నక్సలిజానికి మద్దతుదారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తీర్పు వెలువరించకపోయి ఉంటే, 2020కి ముందే నక్సలిజం ముగిసి ఉండేదన్నారు. కాంగ్రెస్ పార్టీ వామపక్షాల ఒత్తిడితోనే ఇలాంటి వ్యక్తిని అభ్యర్థిగా ఎంపిక చేసిందని విమర్శించారు.






