- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Submarine Accident : సముద్రంలో మునిగిపోయిన టూరిస్ట్ సబ్ మెరైన్
ఈజిప్టు(Egypt)లో మరో ఘోర ప్రమాదం సంభవించింది.

దిశ, వెబ్ డెస్క్ : ఈజిప్టు(Egypt)లో మరో ఘోర ప్రమాదం సంభవించింది. ఈజిప్టులోని హురఘడ్(Hurghad) లో ఎర్ర మహాసముద్రం(Red Sea)లో టూరిస్ట్ సబ్ మెరైన్(Tourist Submarine) మునిపోయి ఆరుగురు మృతి చెందారు. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కాగా ప్రమాద సమయంలో సబ్ మెరైన్లో 40 మంది పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది. హురఘడ్ పర్యటకానికి ప్రసిద్ధి కాగా.. ఇక్కడి పగడపు దిబ్బలు(Coral Reevs) చూసేందుకు టూరిస్టులు ఎగబడతారు. అయితే టూరిస్ట్ సబ్ మెరైన్లను కూడా ఇక్కడి ప్రభుత్వం అనుమతించింది.
ఈ సబ్ మెరైన్ లు కేవలం 25 మీటర్ల లోతు వరకు మాత్రమే వెళ్లాల్సి ఉండగా.. సబ్ మెరైన్ పేలిపోయి 200 మీటర్ల లోతువరకు మునిగిపోయినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదం పోర్ట్ కు దగ్గరలోనే జరగడంతో హుటాహుటిన రక్షణ దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు మొదలు పెట్టాయి. కాగా ఈ ప్రాంతంలో బోటు ప్రమాదాలు, సబ్ మెరైన్ ప్రమాదాలు కూడా ఎక్కువే అని స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది.






