పీఎం మోడీని కలిసిన శుభాంశు శుక్లా

by Yella Dhawani Reddy |

యాక్సియం-4 అంతరిక్ష యాత్ర విజయవంతమైన తర్వాత తొలిసారిగా ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా (Shubhamshu Shukla) భారత్‌ పర్యటనకు వచ్చారు.

పీఎం మోడీని కలిసిన శుభాంశు శుక్లా
X

దిశ, వెబ్ డెస్క్: యాక్సియం-4 అంతరిక్ష యాత్ర విజయవంతమైన తర్వాత తొలిసారిగా ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా (Shubhamshu Shukla) భారత్‌ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi)ని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. మోడీకి శుక్లా యాక్సియం-4 మిషన్ ప్యాచ్‌ను బహుకరించారు. అలాగే, అంతరిక్ష కేంద్రం నుంచి భూమి చిత్రాలను చూపించారు. అనంతరం, ఇద్దరూ భారత్‌లో అంతరిక్ష రంగ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు. కాగా, అమెరికాలోని ఫ్లోరిడా నుంచి జూన్ 25న నింగిలోకి దూసుకెళ్లిన యాగ్జియం–4 మిషన్‌లోని నలుగురు వ్యోమగాముల్లో శుభాంశు శుక్లా కీలక పాత్ర పోషించారు. 18 రోజుల ఈ మిషన్‌లో శుక్లా మిగతా వ్యోమగాములతో కలిసి ఐఎస్ఎస్‌లో 60 కంటే ఎక్కువ ప్రయోగాలు, 20 అవుట్‌రీచ్ సెషన్‌లను నిర్వహించారు.

Next Story