- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > Fire Accident: తరగతి గదిలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న విద్యార్థులు..
Fire Accident: తరగతి గదిలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న విద్యార్థులు..
అస్సాం లోని సిల్చార్‌లో భారీ అగ్నిప్రమాధం చోటుచేసుకుంది.

X
దిశ వెబ్ డెస్క్: అస్సాం లోని సిల్చార్‌లో భారీ అగ్నిప్రమాధం చోటుచేసుకుంది. సిల్చార్‌లోని ఒక భవనంలో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్‌ను నడుపుతున్నారు. కాగా ఆ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్‌లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. అయితే మంటలు వ్యాపించిన సమయంలో తరగతి గదిలో విద్యార్థులు ఉన్నారు. దీనితో విద్యార్థులందరూ మంటల్లో చిక్కుకున్నారు. కాగా ఈప్రమాదం గురించి స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందిచారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అలానే మంటల్లో చిక్కుకున్న విద్యార్థులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే మంటల్లో చిక్కుకున్న విద్యార్థుల్లో కొందరు బయాందోళనకు గురై కిటికీలో నుండి కిందకి దూకుతున్నారు. కాగా అగ్నిప్రమాధం షార్ట్‌సర్క్యూట్ కారణంగానే జరిగినట్టు తెలుస్తోంది.
Next Story






