వరదల్లో చిక్కుకున్న గర్భిణీ ఉపాధ్యాయులు.. 11 కిమీ ఎత్తుకెళ్లి హాస్పిటల్‌కు చేర్చిన విద్యార్థులు..

by Sujitha Rachapalli |

వరదలతో మండీ ప్రాంతం అతలాకుతలమైంది. ఇద్దరు గర్భిణీ ఉపాధ్యాయులు వరదల్లో చిక్కుకుపోయారు. డెలివరీ డేట్ దగ్గరపడుతున్నా కొద్ది టెన్షన్ పెరిగిపోతుంది. వైద్య సేవలు అందుబాటులో లేవు. హాస్పిటల్‌కు వెళ్దామంటే రోడ్లు కొట్టుకుపోయాయి. రక్షణ బృందాలు

వరదల్లో చిక్కుకున్న గర్భిణీ ఉపాధ్యాయులు.. 11 కిమీ ఎత్తుకెళ్లి హాస్పిటల్‌కు చేర్చిన విద్యార్థులు..
X

దిశ, వెబ్ డెస్క్: వరదలతో మండీ ప్రాంతం అతలాకుతలమైంది. ఇద్దరు గర్భిణీ ఉపాధ్యాయులు వరదల్లో చిక్కుకుపోయారు. డెలివరీ డేట్ దగ్గరపడుతున్నా కొద్ది టెన్షన్ పెరిగిపోతుంది. వైద్య సేవలు అందుబాటులో లేవు. హాస్పిటల్‌కు వెళ్దామంటే రోడ్లు కొట్టుకుపోయాయి. రక్షణ బృందాలు వారిని చేరుకోలేకపోయాయి. దీంతో ఆ ఇద్దరు గురువులతోపాటు పుట్టబోయే బిడ్డలను కాపాడుకునేందుకు ముందురొచ్చారు విద్యార్థులు. థునాగ్‌లోని కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ విద్యార్థులు.. తాత్కాలిక పల్లకీలను తయారు చేసి.. తమ ఉపాధ్యాయులను అందులో కూర్చోబెట్టి 11 కిలోమీటర్లు నడిచారు. ప్రమాదకరమైన పర్వత మార్గాలు, వాగులు, కొండచరియలను దాటుకుని హాస్పిటల్‌కు చేరారు. ఒక ఉపాధ్యాయురాలు బాలికకు జన్మనివ్వగా.. మరో ఉపాధ్యాయురాలు బాలుడికి జన్మనిచ్చారు. రెండు జీవితాలు సురక్షితంగా ఈ ప్రపంచంలోకి రాగా.. విద్యార్థులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Next Story