- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
STUDENT SUICIDE : నా చావుకు కారణం అతనే.. అలా వీడియో తీసి.. లైంగిక కోరికలు తీర్చాలని బెదిరిస్తున్నాడు..
ఉత్తరప్రదేశ్ అమ్రోహా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దెహ్రా మిలక్ గ్రామంలో బ్లాక్ మెయిలింగ్ భరించలేక ఆత్మహత్య చేసుకుంది యువతి. తన చావుకు కారణం అదే గ్రామానికి చెందిన అరుణ్ అంటూ చేతిపై రాసుకుని చనిపోయింది. ఏడాది క్రితం సురుచి తన క్లాస్

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ అమ్రోహా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దెహ్రా మిలక్ గ్రామంలో బ్లాక్ మెయిలింగ్ భరించలేక ఆత్మహత్య చేసుకుంది యువతి. తన చావుకు కారణం అదే గ్రామానికి చెందిన అరుణ్ అంటూ చేతిపై రాసుకుని చనిపోయింది. ఏడాది క్రితం సురుచి తన క్లాస్ మేట్‌తో కలిసి బైక్‌పై వెళ్లింది. దీన్ని చూసిన అరుణ్ అనే వ్యక్తి వీడియో తీశాడు. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడ్డాడు. తనను లైంగికంగా సంతృప్తి పరచాలని, ఎప్పుడంటే అప్పుడు డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. లేదంటే వీడియోను విలేజ్ వాట్సాప్ గ్రూప్స్‌లో పోస్ట్ చేస్తానని, వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అమ్మాయి.. తన గదిలోనే ఉరేసుకుంది.
‘ఇదంతా అరుణ్ తప్పు.. ఆయనే నా మరణానికి బాధ్యుడు.. సూసైడ్ నోట్ రాస్తే చింపేస్తారని రాయలేదు’ అని చేయి మీద ఆత్మహత్య నోట్ రాసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. అరుణ్‌ను అదుపులోకి తీసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. వీడియో, బ్లాక్ మెయిలింగ్‌పై విచారిస్తున్నారు.






