స్టూడెంట్‌ను రేప్ చేసిన లేడీ టీచర్.. కొన్నాళ్లుగా హోటళ్లకు తీసుకెళ్లి లైంగిక చర్యలకు ఒత్తిడి.. కోర్టు తీర్పుపై విమర్శలు

by Sujitha Rachapalli |

బొంబాయి స్కాటిష్ స్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేసిన 40 ఏళ్ల బిపాషా కుమార్‌ను జూన్ 28న పోక్సో చట్టం కింద 16 ఏళ్ల మైనర్ విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో అరెస్టు చేశారు. ఆమె తన విద్యార్థిని ఫైవ్-స్టార్ హోటళ్లు

స్టూడెంట్‌ను రేప్ చేసిన లేడీ టీచర్.. కొన్నాళ్లుగా హోటళ్లకు తీసుకెళ్లి లైంగిక చర్యలకు ఒత్తిడి.. కోర్టు తీర్పుపై విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: బొంబాయి స్కాటిష్ స్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేసిన 40 ఏళ్ల బిపాషా కుమార్‌ను జూన్ 28న పోక్సో చట్టం కింద 16 ఏళ్ల మైనర్ విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో అరెస్టు చేశారు. ఆమె తన విద్యార్థిని ఫైవ్-స్టార్ హోటళ్లు, నిర్జన ప్రదేశాలలో లైంగిక చర్యలకు ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మద్యం తాగించి.. బాధితుడు డిప్రెషన్‌లోకి వెళ్లేలా చేసినట్లు కూడా ఆరోపించారు.

అయితే జూలై 22న ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి సబీనా ఎ. మాలిక్.. ఈ సంబంధం ఇద్దరి సమ్మతితో జరిగిందని.. బాధితుడు 16 ఏళ్లు పైబడిన వాడని, కొంత నిర్ణయాధికారం కలిగి ఉన్నాడని పేర్కొంటూ బిపాషాకు బెయిల్ మంజూరు చేశారు. అలాగే బిపాషా ఏప్రిల్ 2025లో స్కూల్ నుంచి రాజీనామా చేసినందున.. ఇది ఇకపై టీచర్-విద్యార్థి సంబంధంగా పరిగణించబడదని స్పష్టం చేశారు. బాధితుడు లేదా సాక్షులను సంప్రదించకూడదని, ముంబై జ్యుడిషియల్ పరిధిలోనే ఉండాలని, రూ.50,000 వ్యక్తిగత బాండ్, ష్యూరిటీతో బెయిల్ మంజూరు చేశారు.

బిపాషా డిఫెన్స్ లాయర్లు ఈ కేసు బాధితుడి తల్లి ఈ సంబంధాన్ని ఒప్పుకోకపోవడం వల్ల కల్పిత కథను అల్లారని వాదించారు. విద్యార్థి బిపాషాను తన భార్యగా సంబోధిస్తూ ప్రేమను వ్యక్తం చేసిన సందేశాలను సాక్ష్యంగా చూపారు. అయితే ప్రాసిక్యూషన్, బాధితుడు బెయిల్‌ను వ్యతిరేకించారు. బిపాషా టీచర్‌గా అధికార స్థానంలో ఉందని.. 18 ఏళ్లలోపు మైనర్‌తో లైంగిక సంబంధం పోక్సో చట్టం కింద సమ్మతితో సంబంధం లేని నేరమని వాదించారు. బాధితుడు బిపాషా విడుదలైతే బెదిరింపులకు పాల్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు.

కాగా ఈ కేసు భారత న్యాయవ్యవస్థలో లింగ డైనమిక్స్‌పై చర్చను రేకెత్తించింది. బిపాషా మహిళ కాబట్టి కోర్టు తేలికగా వ్యవహరించిందని.. ఆడవాళ్లు, మగవాళ్ల నేరాలను చట్టం వేర్వేరుగా చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత చట్టాలు ఆడ నేరస్థులను.. ముఖ్యంగా మగ బాధితుల సందర్భంలో, తగిన రీతిలో గుర్తించడం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Next Story