- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైరల్ వీడియో: 19 సెకన్లలో 9 చెప్పు దెబ్బలు.. కీచక టీచర్‌కు దేహశుద్ధి చేసిన విద్యార్థిని!
ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్ జిల్లా సెవర్హి ప్రాంతంలోని ఓ ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్‌లో ఉపాధ్యాయుడు విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్ జిల్లా సెవర్హి ప్రాంతంలోని ఓ ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్‌లో ఉపాధ్యాయుడు విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వారు కోచింగ్ సెంటర్‌కు వెళ్లి ఉపాధ్యాయుడిని చెప్పులు, పిడిగుద్దులతో చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో విద్యార్థిని సుమారు 19 సెకన్లలో ఉపాధ్యాయుడిని తొమ్మిది సార్లు చెప్పుతో కొట్టడం, కుటుంబ సభ్యులు అతడితో చేతిపై ఉమ్మి వేయించి నాకించడం, అనంతరం క్షమాపణ చెప్పించడం కనిపిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు ఘటనాస్థలికి వెళ్లగా కోచింగ్ సెంటర్ మూసి ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఉపాధ్యాయుడు, విద్యార్థిని కుటుంబ సభ్యులు అందుబాటులో లేరని, ఫిర్యాదు అందితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అలాగే వైరల్ వీడియోపై దర్యాప్తు కొనసాగుతోందని సెవర్హి స్టేషన్ హౌస్ ఆఫీసర్ మనోజ్ వర్మ వెల్లడించారు.






