Student: ఒడిశాలో కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య సిగ్గుచేటు.. సుప్రీంకోర్టు

by B.Srinivas |

ఒడిశాలోని బాలాసోర్‌కు చెందిన 20 ఏళ్ల బీఎడ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

Student: ఒడిశాలో కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య సిగ్గుచేటు.. సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలోని బాలాసోర్‌కు చెందిన 20 ఏళ్ల బీఎడ్ విద్యార్థిని తనపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని చేసిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనను సుప్రీంకోర్టు సిగ్గుచేటు అని అభివర్ణించింది. నేటి కాలంలో ఈ తరహా ఘటనలు జరగడం విచారకరమని తెలిపింది. పాఠశాల బాలికలు, గృహిణులు, గ్రామీణ పిల్లలకు సాధికారత కల్పించడానికి దీర్ఘకాలిక చర్యలు అవసరమని అభిప్రాయపడింది. ఇందుకు కేంద్రం, అన్ని పక్షాల నుంచి సలహాలు ఇవ్వాలని తెలిపింది. సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం తరపు న్యాయవాది ఈ ఘటనను కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో న్యాయమూర్తులు సూర్యకాంత్, జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘విషాద ఘటనపై మేము సిగ్గుపడుతున్నాం. ఈ తరహా ఘటనలు ఇప్పటికీ జరగడం దురదృష్టకరం. ఇది వ్యతిరేక వ్యాజ్యం కాదు. కేంద్రం, అన్ని పక్షాల నుంచి మాకు సూచనలు అవసరం’ అని పేర్కొంది. కేంద్రం తరపున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి మాట్లాడుతూ.. ప్రజా భద్రతా, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నట్టు కోర్టుకు తెలియజేశారు. లైంగిక నేరస్థులను గుర్తించడానికి బహిరంగ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

Next Story