భారత్‌తో దీర్ఘకాలిక ఆర్థిక సంబంధాలు బలోపేతం: పుతిన్‌

by Yella Dhawani Reddy |

భారత్‌తో రష్యా అనుబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాము కృషి చేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Russian President Vladimir Putin) తెలిపారు.

భారత్‌తో దీర్ఘకాలిక ఆర్థిక సంబంధాలు బలోపేతం: పుతిన్‌
X

దిశ, వెబ్ డెస్క్: భారత్‌తో రష్యా అనుబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాము కృషి చేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Russian President Vladimir Putin) తెలిపారు. ద్వైపాక్షికంగా ఆర్థిక సంబంధాలు మరింత విస్తృతంగా కొనసాగాలని, ప్రత్యేకించి శక్తి వనరుల రంగంలో భాగస్వామ్యం పెరగాలని అభిప్రాయపడ్డారు. చమురు, గ్యాస్‌ ఎగుమతులు పెంచాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ప్రపంచంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక అస్థిరతల నేపథ్యంలో తమ దేశం వాణిజ్య పరంగా కొత్త మార్గాలను అన్వేషిస్తోందని పుతిన్‌ వెల్లడించారు.

కాగా, ఇరు దేశాల మధ్య వాణిజ్య మార్పిడి గత కొన్ని సంవత్సరాల్లో గణనీయంగా పెరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చమురు కొనుగోళ్లలో భారత్‌ రష్యాపై ఆధారపడుతున్న తీరుకు ఇప్పుడు వాణిజ్య విస్తరణ రూపం దక్కుతోందని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. పుతిన్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఇది భారత్‌-రష్యా సంబంధాల్లో మరో కీలక మలుపుగా పరిగణించవచ్చని భావిస్తున్నారు.

Next Story