Delhi CM: ఢిల్లీ సీఎం కాన్వాయ్ త్రుటిలో తప్పిన ప్రమాదం

by Shamantha N |

ఢిల్లీ సీఎం రేఖా గుప్తా(Delhi CM Rekha Gupta) కాన్వాయ్‌కు పశువులు అడ్డుగా వచ్చాయి. అకస్మాత్తుగా ఆవుల మంద రోడ్డుపైకి రావడంతో సీఎం కాన్వాయ్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది.

Delhi CM: ఢిల్లీ సీఎం కాన్వాయ్ త్రుటిలో తప్పిన ప్రమాదం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా(Delhi CM Rekha Gupta) కాన్వాయ్‌కు పశువులు అడ్డుగా వచ్చాయి. అకస్మాత్తుగా ఆవుల మంద రోడ్డుపైకి రావడంతో సీఎం కాన్వాయ్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. గమనించిన వాహనాల డ్రైవర్లు అప్రమత్తమయ్యారు. అత్యవసరంగా బ్రేకులు వేసి సీఎం కాన్వాయ్‌ను నిలిపివేశారు. బుధవారం ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కాన్వాయ్‌ హైదర్‌పూర్ ఫ్లైఓవర్‌పై వెళ్తుండగా పశువులు అడ్డుగా వచ్చాయి. దీంతో సీఎం కాన్వాయ్‌ అత్యవసరంగా ఆగిపోయింది. కాగా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తన వాహనం నుంచి కిందకు దిగారు. కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చిన ఆవులను పరిశీలించారు. అధికారులతో కలిసి ఫ్లైఓవర్‌పై కొంత దూరం నడిచారు. రోడ్డుపైకి పశువులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత తన నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలను ఆమె సందర్శించారు. పలు వార్డులను పరిశీలించారు. సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అయితే సీఎం కాన్వాయ్‌కు పశువులు అడ్డుగా వచ్చిన వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అంతేకాకుండా, మెట్రో పిల్లర్లను పరిశీలించారు. వాటిపై వేలాడుతున్న పోస్టర్లు, హోర్డింగ్‌లపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని తొలగించాలని అధికారులను కోరారు. ఇటువంటి బ్యానర్లు నగర అందమైన ప్రకృతి దృశ్యాన్ని పాడు చేస్తున్నాయని.. ఇలాంటి చర్యలను నిరుత్సాహపరచాలని అన్నారు.

Next Story