యూపీలో వింత ఘటన.. పారిపోయి పెళ్లి చేసుకున్న అక్కాచెల్లెళ్లు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-08 05:27:08  IST  )

ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ యువతి ఇటీవల ఇంటి నుంచి పారిపోయింది. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవటంతో.. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని భావించి యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యూపీలో వింత ఘటన.. పారిపోయి పెళ్లి చేసుకున్న అక్కాచెల్లెళ్లు
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకోవటం, కలిసి జీవించటం సహజం. కానీ, ఇటీవల కాలంలో అమ్మాయిలూ అమ్మాయిలను, అబ్బాయిలూ అబ్బాయిలను పెళ్లిచేసుకునే వింత ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అంతేకాదు, అక్కాచెల్లెళ్ల వరుసైన వారు, అన్నదమ్ములు కూడా పెళ్లిళ్లు చేసుకుని తమ తల్లిదండ్రులకు షాకిస్తున్నారు. తాజాగా యూపీలో (Uttarpradesh) ఇలాంటి ఆశ్చర్యకరమైన వింత ఘటనే వెలుగుచూసింది. ముజఫర్‌నగర్‌కు (Muzafarnagar) చెందిన ఓ యువతి ఇటీవల ఇంటి నుంచి పారిపోయింది. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవటంతో.. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని భావించి యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా పోలీసులు ఆమె ఆచూకీ గుర్తించారు. అయితే, ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే.. సదరు యువతి ఇంటి నుంచి పారిపోయి తనకు సోదరి వరుసైన మరో యువతిని పెళ్లిచేసుకుంది. ఏడాదిగా తాము ప్రేమించుకుంటున్నామని కుటుంబసభ్యులు తమ ప్రేమను వ్యతిరేకించడంతో పారిపోయి వివాహం చేసుకున్నామన్నారు. పరస్పర అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నామని, ఇకపై భార్యాభర్తలుగా (Husband-Wife) కలిసి జీవించాలనుకుంటున్నట్లు చెప్పటంతో పోలీసులు వారికి భద్రత కల్పించారు. ఈ పరిణామంతో కుటుంబసభ్యులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Next Story