Nepal: నేపాల్ లో ఆదోళనలు.. వివాదంలో ఇండియన్ న్యూస్ చానల్!.. అసలేం జరిగిందంటే?

by Prasad Jukanti |

ప్రముఖ జాతీయ మీడియాను బ్యాన్ చేయాలని నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

Nepal: నేపాల్ లో ఆదోళనలు.. వివాదంలో ఇండియన్  న్యూస్ చానల్!.. అసలేం జరిగిందంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: పొరుగు దేశం నేపాల్ లో (Nepal) అల్లర్లు చల్లారటం లేదు. సోషల్ మీడియా బ్యాన్ కు నిరసనగా మొదలైన ఆందోళనలు ఆ దేశంలో రాజకీయ భూకంపానికి కారణం అవుతోంది. ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేసినా ఆందోళన కారులు శాంతించడం లేదు. ఇప్పటికే వెర్రి కోపంతో ఉన్న నేపాలీలు ఏ లీడరైనా రోడ్లపై కనిపిస్తే ఊరికించి మరీ కొడుతున్నారు. దీంతో నిన్నా మొన్నటి వరకు సకల హంగులు, భారీ బందోబసల్తు నడుమ బతికిన రాజకీయ నాయకులు ఏ క్షణంలో ఎటువైపు నుంచి తమపై ఆందోళనకారులు దూసుకువస్తారో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. నేపాల్ లో చెలరేగిన ఆందోళనల వేళ మన దేశంపైకి ఎలాంటి ముప్పు రాకుండా మన ప్రభుత్వం ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే తాజాగా నేపాల్ విషయంలో కథనం ప్రసారం చేసిన ఓ ఇండియన్ న్యూస్ చానల్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఆ చానల్ ను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

బ్రాహ్మణుల ఆధిపత్యం అంటూ..

నేపాల్ లో ప్రశాంతంగా మొదలైన ఆందోళన హింసాత్మకంగా మారడం, సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసినా నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఈ రావణకాష్టను రగిలించింది ఎవరు? అసలు దీని వెనుకఉన్న ఉద్దేశం ఏమిటి అనేదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈక్రమంలో తాజాగా ఏబీపీ (Ban ABP News) అనే జాతీయ న్యూస్ చానల్ నేపాల్ ఆందోళనలపై ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ఈ ఆందోళనల వెనుక కారణాలను విశ్లేషిస్తూ నేపాల్ లో తిరుగుబాటుకు కులతత్వమే కారణమా? ప్రభుత్వ వ్యవస్థలలో బ్రహ్మణుల ఆధిపత్యం పెరిగిపోయిందనే అసంతృప్తి ఆ దేశ ప్రజల్లో ఉందని కథనం ప్రసారం చేసింది. నేపాల్ లో రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ఆర్మీ చీఫ్, పార్లమెంట్ స్పీకర్ వంటి కీలక పదవుల్లో బ్రాహ్మణులే ఉన్నారని, నేపాల్ జనాభాలో 12.2 శాతం ఉన్న బ్రాహ్మణులు ఇలా కీలకమైన పోస్టులన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయనే అంశాలతో పాటు పలు కీలక విషయాలను ఈ కథనంలో పేర్కొంది.

ట్రెండింగ్ లో బ్యాన్ ఏబీపీ:

అయితే నేపాల్ అల్లర్ల వెనుక కుల కోణం ఉందని ఏబీపీ న్యూస్ కథనం ప్రసారం చేయడంపై భారతీయ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణుల పై ఆరోపణలు చేస్తూ కథనం నడిపిస్తే టీఆర్పీ రేటింగ్ బాగుటుందనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియాలో బ్యాన్ ఏబీపీ న్యూస్ అంటూ యాష్ ట్యాగ్స్ ఇస్తూ తమ నిరసన తెలుపుతున్నారు. ప్రస్తుతం ఎక్స్ లో బ్యాన్ ఏబీపీ అనే యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది.

Next Story