- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stone Pelting : మహకుంభ్‌కు భక్తులతో వెళ్తున్న రైలుపై రాళ్ల దాడి
మహకుంభ్ మేళాకు ‘తప్తి గంగా’ ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్తున్న భక్తులపై రాళ్ల దాడి తీవ్ర కలకలం రేపింది.

దిశ, నేషనల్ బ్యూరో : మహకుంభ్ మేళాకు ‘తప్తి గంగా’ ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్తున్న భక్తులపై రాళ్ల దాడి తీవ్ర కలకలం రేపింది. భక్తులు సూరత్ నుంచి చాప్రాకు వెళ్తుండగా మహారాష్ట్రలోని జల్‌గావ్ స్టేషన్ వద్ద ఆదివారం రాత్రి ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జల్ గావ్ స్టేషన్ నుంచి రైలు రెండు నుంచి మూడు కిలో మీటర్ల దూరం ప్రయాణించింది. తర్వాత ఒక్కసారిగా కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు రైలుపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బీ6 కోచ్ కిటికీలు ధ్వంసమయ్యాయి. కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్ రాజ్ వెళ్తండగా జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు తమ భద్రత విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఘటన తర్వాత భక్తులు తీసిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైరల్ అవుతోన్న వీడియోలో ఓ భక్తుడు మాట్లాడుతూ.. రైళ్లలో భద్రతను మరింత పెంచాలని రైల్వే శాఖ ఉన్నతాధికారులను కోరాడు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు జల్ గావ్ రైల్వే పోలీసులు తెలిపారు. ఘటనకు బాధ్యులైన వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దాడి తర్వాత ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను మెరుగుపరుస్తామని రైల్వే శాఖ అధికారులు హామీ ఇచ్చారు.






