Stolen: ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారంలో దొంగల హల్ చల్.. బంగారం, సెల్ ఫోన్లు చోరీ!

by B.Srinivas |

ముంబైలోని అజాద్ మైదాన్ లో ఈ నెల 5న మహాయుతి ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన విషయం తెలిసిందే.

Stolen: ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారంలో దొంగల హల్ చల్.. బంగారం, సెల్ ఫోన్లు చోరీ!
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబైలోని అజాద్ మైదాన్ లో ఈ నెల 5న మహాయుతి ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన విషయం తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవీస్ (Devendr Fadnavis) సీఎంగా, శివసేనకు చెందిన ఏక్‌నాథ్ షిండే (Eknath shinde), ఎన్సీపీ నేత అజిత్ పవార్‌(Ajith pawar)లు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. ఓ వైపు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంటే మరో వైపు దొంగలు తమపని తాము చేసుకున్నారు. ఈ వేడుకకు హాజరైన 13 మంది తమ బంగాలు గొలుసులు, మొబైల్ ఫోన్లు, రూ.12లక్షల విలువైన నగదు చోరీకి గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. చాలా మందివి పర్సులు, గొలుసులు, నగదు చోరీ చేసినట్టు వెల్లడించారు. దొంగలను గుర్తించేందుకు సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తు్న్నట్టు ఆజాద్ మైదాన్ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఈవెంట్‌ ముగిసిన అనంతరం మైదానంలోని గేట్ నంబర్ టూ నుంచి బయటకు వస్తున్న వ్యక్తులను సద్వినియోగం చేసుకున్న దొంగలు చోరీకి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. అయితే ప్రధాని మోడీ సైతం హాజరైన ఈ కార్యక్రమంలోనే చోరీ జరగడంతో భద్రతపై ఆందోళన కలుగుతోంది.

Next Story