Pakistan: రెండు నెలలకు సరిపడా ఆహారం, మందులు నిల్వ చేసుకోండి

by Shamantha N |

పహెల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్‌ల (India-Pakistan) మధ్య ఉద్రిక్త వాతావరణ నెలకొంది. కాగా.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని భారత్ కు ప్రపంచ దేశాలు సూచనలు చేస్తున్నాయి.

Pakistan: రెండు నెలలకు సరిపడా ఆహారం, మందులు నిల్వ చేసుకోండి
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్‌ల (India-Pakistan) మధ్య ఉద్రిక్త వాతావరణ నెలకొంది. కాగా.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని భారత్ కు ప్రపంచ దేశాలు సూచనలు చేస్తున్నాయి. అయితే, ఇలాంటి టైంలో ఆహారం నిల్వ చేసుకోవాలంటూ స్థానికులను పీఓకే యంత్రాంగం అప్రమత్తం చేసింది. ‘‘రెండు నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని నియంత్రిక రేఖకు సమీపంలో ఉన్న 13 నియోజకవర్గాల ప్రజలకు సూచనలు చేశాం’’ అని చౌధ్రీ అన్వర్ ఉల్‌హక్‌ స్థానిక అసెంబ్లీలో శుక్రవారం వెల్లడించారు. అలాగే స్థానిక ప్రభుత్వం రూ.వంద కోట్లతో ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. ఫుడ్, మెడిసిన్, ఇతర కనీస అవసరాల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకే ఈ మొత్తాన్ని కేటాయించినట్లు ఉల్‌హక్ తెలిపారు.

విమానరాకపోకలు బంద్

అంతకుముందు, భద్రతా కారణాల దృష్ట్యా పాక్ ఆక్రమిత ప్రాంతంలో విమానరాకపోకలన్నింటిని పాకిస్థాన్ జాతీయ విమానయాన సంస్థ రద్దు చేసింది. ఏప్రిల్ 22న మధ్యాహ్నం జమ్ముకశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతమైన పహెల్గాం (Pahalgam)లో ఉగ్రవాదులు అమాయకులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. దీంతో, భారతప్రభుత్వం పాక్ పై ప్రతీకార చర్యలకు దిగింది. వీసాలు రద్దు, సింధు జలాల ఒప్పందం నిలిపివేత, ఔషధాల ఎగుమతి, పాకిస్థాన్‌ నటుల సినిమాలు బ్యాన్‌ చేసింది.

Next Story