- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుప్రీంకోర్టు తీర్పుపై సమీక్ష కోరుతూ ఎస్టీఎఫ్ఐ వినతిపత్రాలు
సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో 25 లక్షల మంది ఉపాధ్యాయుల ఉద్యోగాలకు ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తూ, స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) ప్రధానమంత్రి, విద్యాశాఖ మంత్రికి వినతిపత్రాలు సమర్పించింది. టెట్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని, అలాగే విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని వారు ఈ వినతిపత్రాల్లో కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో 25 లక్షల మంది ఉపాధ్యాయుల ఉద్యోగాలకు ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తూ, స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) ప్రధానమంత్రి, విద్యాశాఖ మంత్రికి వినతిపత్రాలు సమర్పించింది. టెట్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని, అలాగే విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని వారు ఈ వినతిపత్రాల్లో కోరారు. ఎస్టీఎఫ్ఐ అధ్యక్షుడు సి.ఎన్. భారతి, ప్రధాన కార్యదర్శి చావ రవి, కోశాధికారి అబ్దుల్లా షఫీలు బుధవారం న్యూ ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం, విద్యాశాఖ మంత్రి కార్యాలయాల్లో ఈ వినతిపత్రాలను అందజేశారు.నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) చైర్మన్ పంకజ్ అరోరా, కార్యదర్శి అభిలాష మిశ్రాలను కూడా కలిశారు. టెట్ సిలబస్‌ను మార్చాలని, అలాగే ఉత్తీర్ణత మార్కులను 60 శాతం నుండి 50 శాతానికి తగ్గించాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం, వారు సుప్రీంకోర్టును సందర్శించి సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరిపారు. ఈ నెలాఖరులోగా ఎస్టీఎఫ్ఐ తరపున సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయడానికి ఏర్పాట్లు చేశామని ఎస్టీఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒక ప్రకటనలో తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పుతో ఉపాధ్యాయులకు భయం
సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ఐదేళ్లకు మించి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులందరూ రెండేళ్లలోపు టెట్ ఉత్తీర్ణులు కావాలి లేదా ఉద్యోగం నుండి విరమించుకోవాలి. ఈ తీర్పు 2010కి ముందు దేశవ్యాప్తంగా నియమితులైన దాదాపు 25 లక్షల మంది ఉపాధ్యాయులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఎస్టీఎఫ్ఐ పేర్కొంది. 20 నుండి 25 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన సీనియర్ ఉపాధ్యాయులకు ఇది చాలా ఇబ్బందికరమని వారు అభిప్రాయపడ్డారు. గత 15 సంవత్సరాలుగా ఎన్సీటీఈ, రాష్ట్ర ప్రభుత్వాలు 2010 కు ముందు నియమితులైన వారికి టెట్ అవసరం లేదని చెప్పాయని, కొన్ని రాష్ట్రాలు మినహాయింపులు కూడా ఇచ్చాయని వారు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వారి ఉద్యోగాలకు ముప్పు తెచ్చిందని, కేంద్రం జోక్యం చేసుకుని వారికి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు.






