కొడుకుతో కాళ్లు నొక్కించుకున్న తల్లి.. ఆపై ఎఫర్.. ఇంట్లో చెప్పకుండా జంపింగ్! లబోదిబోమంటున్న తండ్రి..

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-15 08:46:33  IST  )

హర్యానా నుహ్ జిల్లాలో వింత చోటు చేసుకుంది. సవతి తల్లితో లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు కొడుకు. విషయం తెలిసి లబో దిబో అంటున్నాడు తండ్రి.

కొడుకుతో కాళ్లు నొక్కించుకున్న తల్లి.. ఆపై ఎఫర్.. ఇంట్లో చెప్పకుండా జంపింగ్! లబోదిబోమంటున్న తండ్రి..
X

దిశ, వెబ్ డెస్క్ : హర్యానా నుహ్ జిల్లాలో వింత చోటు చేసుకుంది. సవతి తల్లితో లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు కొడుకు. విషయం తెలిసి లబో దిబో అంటున్నాడు తండ్రి. రామ్ కిషన్ అనే వ్యక్తి మొదటి భార్య చనిపోగా.. గురుగ్రామ్ సోహ్నా ఏరియాకి చెందిన మోనికను రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కొడుకు ఆమెతో ఎలా ఉంటాడోనని భయపడ్డాడు. కానీ ఇద్దరు కూడా ఒకరిపై మరొకరు ప్రేమగానే మెలిగారు. రెండో భార్య సవతి తల్లిలా కాకుండా.. చాలా ప్రేమ కురిపించడంతో సంతోషించాడు. ఆ కుర్రాడు కూడా అమ్మ అనే పిలిచేవాడు. హెల్త్ బాగాలేకపోతే ఇంటి పనులు చేసి పెట్టేవాడు. కాళ్లు కూడా నొక్కేవాడు.

కానీ కొన్ని నెలలు గడిచాక అసలు ట్విస్ట్ ఇచ్చింది లైఫ్. ఓ రోజు ఇద్దరూ ఇంట్లో లేకపోవడం.. కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో.. రామ్ కిషన్‌కు భయమేసింది. ఊళ్లో వాళ్లు భార్య, కొడుకు బస్సు ఎక్కుతున్నప్పుడు చూశామని చెప్పడంతో.. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించాడు. మొత్తానికి మొబైల్ IMEI నంబర్ ఆధారంగా వారు ఎక్కడున్నారో కనిపెట్టారు పోలీసులు. దీంతో అసలు విషయం బయటపడింది. అప్పటికే తాము కోర్టు మ్యారేజ్ చేసుకున్నట్లు చెప్పారు. మోనికకు 40ఏళ్లు కాగా ఆ అబ్బాయికి 21 అని.. ఇష్టపడే ఇదంతా చేశామన్నారు. తమను విడదీయకూడదని రిక్వెస్ట్ చేశారు.

Next Story