Supreme Court: బెదిరిస్తే మా దృష్టికి తీసుకురండి.. ఎస్ఐఆర్‍పై సుప్రీంకోర్టు

by Prasad Jukanti |

ఎస్ఐఆర్‍పై రాష్ట్రాలకు సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Supreme Court: బెదిరిస్తే మా దృష్టికి తీసుకురండి.. ఎస్ఐఆర్‍పై సుప్రీంకోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (S.I.R) ను రాష్ట్రాలు కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఐఆర్‍ను సవాల్ చేస్తూ, దాని నిర్వహణలో ఎదురవుతోన్న పరిస్థితులపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వచ్చే ఏడాది బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో ఎస్ఐఆర్ జరుగుతోంది. ఈ ప్రకియలో భాగమైన బీఎల్ఓలు ఇతర అధికారులకు బెదిరింపులు వచ్చాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. బెంగాల్ లో ఎస్ఐఆర్ కొనసాగుతుందని స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. బీఎల్‍వోలు, అధికారులపై బెదిరింపు ఘటనలను తమ దృష్టికి తీసుకురావాలని ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో బెదిరింపులు, అంతరాయాల గురించి తమ దృష్టికి తీసుకువస్తే వారి భద్రతకు సంబంధించిన తగిన ఆదేశాలు జారీ చేస్తాని స్పష్టం చేసింది. ఒక వేళ బీఎల్‍వోలు అధికారులు ఒత్తిడికి గురైతే వారి స్థానంలో వేరే వారిని తీసుకుని ఎస్ఐఆర్ జరిగేలా చూడాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. కాగా ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రెండో దశ ఎస్ఐఆర్ కొనసాగుతోంది.

Next Story