- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Starmer: భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అపూర్వం.. యూకే పీఎం కీర్ స్టార్మర్
భారత్, బ్రిటన్ మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అపూర్వమైందని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ కొనియాడారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, బ్రిటన్ మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అపూర్వమైందని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ (Kier starmer) కొనియాడారు. దాని వల్ల వాణిజ్యం పెంచుకోవడానికి అపారమైన అవకాశాలు ఏర్పడ్డాయని తెలిపారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. 2028 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే ఇండియాతో ద్వైపాక్షిక వాణిజ్యం వృద్ధికి లాంచ్ ప్యాడ్ వంటిదని అభివర్ణించారు. తద్వారా వారితో వ్యాపారం వేగంగా, సానుకూలంగా ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు ఏ దేశంతోనూ ఇంత ఉత్తమంగా వాణిజ్య ఒప్పందం చేసుకోలేదని చెప్పారు. తమకు అందుబాటులో ఉన్న అవకాశాలు సాటిలేనవని, వాటిని కొనసాగించాలన్నారు. ట్రేడ్ అగ్రిమెంట్స్‌ను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామన్నారు. భారత్‌లో వృద్ధి అంటే బ్రిటన్ ప్రజలకు మరిన్ని ఎంపికలు, అవకాశాలు, ఉద్యోగాలు అని తెలిపారు.
రేపు మోడీతో భేటీ
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ గురువారం భారత పీఎం మోడీతో భేటీ కానున్నారు. ముంబైలో జరిగే ఈ సమావేశంలో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం సహా పలు అంశాలపై డిస్కస్ చేయనున్నారు. అంతకుముందు ఆయన యష్ రాజ్ స్టూడియోలను సందర్శిస్తారు. అనేక మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. కాగా, యూకే ప్రధానిగా స్టార్మర్ బాధ్యతలు చేపట్టాక ఇండియాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.






