- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Stampede: గోవాలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి
గోవాలోని షిర్గావ్‌లో ఉన్న లైరాయ్ దేవి జాత్రా ఆలయంలో శనివారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది.

దిశ, నేషనల్ బ్యూరో: గోవాలోని షిర్గావ్‌లో ఉన్న లైరాయ్ దేవి (Lairay devi) జాత్రా ఆలయంలో శనివారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరో 80 మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనకు గల కారణాలను అధికారులు వెల్లడించలేదు. అయితే జాతరలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరాగా ఓ షాపు ముందు షార్ట్ సర్య్కూట్ కావడంతో గందరగోళం తలెత్తి తొక్కిసలాట జరిగిందని స్థానికులు తెలిపారు.
ఘటన జరిగిన సమయంలో ఆలయంలో దాదాపు 50,000 నుండి 70,000 మంది భక్తులు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. దీనిపై సీఎం ప్రమోద్ సావంత్ (Pramod savanth) విచారణకు ఆదేశించారు. అలాగే ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీలు దిబ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘గోవాలో జరిగిన తొక్కిసలాట దురదృష్టకరం. భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసి బాధపడ్డా. బాధిత కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ముర్ము, మోడీలు ట్వీట్ చేశారు.






