Stampede: రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట...15 మంది మృతి

by B.Srinivas |

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 15 మంది గాయపడగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Stampede: రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట...15 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 15 మంది గాయపడగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో కుంభమేళాకు వెళ్లేందుకు భక్తులు భారీగా స్టేషన్‌లోకి వచ్చారు. దీంతో ప్రయాగ్ రాజ్ వెళ్లే రైళ్లకు సంబంధించిన 13, 14 నంబర్ల ఫ్లాట్ ఫామ్‌లు ప్రయాణికులతో కిక్కిరిసాయి. ఈ క్రమంలోనే ఓ రైలు రావడంతో ఆ ట్రెయిన్ ఎక్కే నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది. ఘటనను రైల్వే డీసీపీ కెపీఎస్ మల్హోత్రా ధ్రువీకరించారు. ప్లాట్‌ఫామ్ నంబర్ 14 వద్ద, ప్లాట్‌ఫామ్ నంబర్ 1 సమీపంలోని ఎస్కలేటర్ దగ్గర స్వల్ప తొక్కిసలాట జరిగిందని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. మృతుల్లో 11 మంది మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు సమాచారం. ఘటనపై ఎల్జీ వీకే సక్సేనా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.

తొక్కిసలాట ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ మాజీ సీఎం అతిశీ స్పందించారు. కేంద్ర, యూపీ ప్రభుత్వాలు ప్రజల భద్రతను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ‘మహా కుంభమేళాకు భక్తులు వెళ్తున్న క్రమంలో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం. ప్రభుత్వాలు ప్రజల భద్రతపై ఆందోళన చెందడం లేదు. ప్రయాగ్‌రాజ్‌లో ఎటువంటి ఏర్పాట్లు లేవు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం సైతం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ప్రజలకు వీలైనంత త్వరగా సహాయం అందించాలి’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Next Story