ఓడిన నియోజకవర్గంలో స్టాలిన్ రోడ్ షో.. గుండె పగిలేలా ఏడ్చేసిన అభిమానులు

by Ajay Maddhiboyina |

తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ కొళత్తూరు నియోకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. స్టాలిన్ ఈ నిజయెకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలను కలిశారు.

ఓడిన నియోజకవర్గంలో స్టాలిన్ రోడ్ షో.. గుండె పగిలేలా ఏడ్చేసిన అభిమానులు
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ కొళత్తూరు నియోకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. స్టాలిన్ ఈ నిజయెకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలను కలిశారు. తనకు, కోళత్తూరు ప్రజలకు ఉన్న బంధం గెలుపు ఓటములకు అతీతమైనదని అన్నారు. 15ఏళ్లుగా మద్దతు ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సాధ్యమైన అన్ని పథకాలను అమలు చేశానని చెప్పారు.

ఎల్లప్పుడూ మీతోనే ఉంటానని ప్రజలకు హామీ ఇచ్చారు. స్టాలిన్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయనను చూసి కొందరు అభిమానులు బోరున విలపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టాలిన్ ఓడిన నియోజకవర్గంలో పర్యటించడమే కాకుండా గెలిచిన, ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులను వారి వారి నియోజకవర్గాల్లో పర్యటించాలని కోరారు. ఇదిలా ఉంటే స్టాలిన్ పై టీవీకే పార్టీకి చెందిన వీఎస్ బాబు అనే అభ్యర్థి విజయం సాధించారు. గతంలో స్టాలిన్ వరుసగా మూడుసార్లు గెలవగా ఈ సారి బాబు ఓడించారు. విజయ్ రెండు చోట్ల పోటీ చేసి గెలవగా అందులో ఒక స్థానానికి రాజీనామా చేసే అవకాశం ఉంది. దీంతో అక్కడ ఉపఎన్నిక వస్తే స్టాలిన్ పోటీ చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Next Story