- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Stalin: పంబన్ రైల్వే వంతెన ప్రారంభోత్సవానికి స్టాలిన్ గైర్హాజరు
దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే వంతెన ప్రారంభోత్సవం జరిగింది. తమిళనాడులోని రామేశ్వరంలో కొత్తగా నిర్మించిన ఈ పంబన్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు.

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే వంతెన ప్రారంభోత్సవం జరిగింది. తమిళనాడులోని రామేశ్వరంలో కొత్తగా నిర్మించిన ఈ పంబన్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్న ఈ కార్యక్రమానికి సీఎం ఎంకే స్టాలిన్ గైర్హాజరయ్యారు. (Stalin skips PM’s Pamban event) అయితే డీలిమిటేషన్‌పై ప్రధాని హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం ఒక కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడారు. ‘తమిళ గడ్డపై నిలబడి, ప్రధాని స్పష్టమైన హామీ ఇవ్వాలి. తమిళనాడుతో సహా జనాభా పెరుగుదలను విజయవంతంగా నియంత్రించిన ఇతర రాష్ట్రాలకు రాబోయే డీలిమిటేషన్ కసరత్తులో ఎలాంటి జరిమానా విధించకూడదు. పార్లమెంటు సీట్లలో రాష్ట్రాల వాటా చెక్కుచెదరకుండా చూడాలి. న్యాయమైన డీలిమిటేషన్ విధానంపై పార్లమెంట్‌లో తీర్మానం చేయాలి’ అని అన్నారు. పార్లమెంటులో తీర్మానం ఆమోదించడం ద్వారా ప్రధాని న్యాయమైన డీలిమిటేషన్ జరిగేలా చూడాలన్నారు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణతో దానిని అమలు చేయాలన్నారు. న్యాయమైన డీలిమిటేషన్‌ను నిర్ధారించడానికి ఇదే ఏకైక మార్గమని చెప్పుకొచ్చారు. దీనిపై మోడీ చర్య తీసుకుంటారని తాను హృదయపూర్వకంగా ఆశిస్తున్నట్లు తెలిపారు.
తమిళ ప్రజల భయాందోళనలు
ప్రతిపాదిత డీలిమిటేషన్ కసరత్తుపై తమిళనాడు ప్రజలు భయాందోళనలు చెందుతున్నారని స్టాలిన్ తెలిపారు. కాగా, తమిళనాడు ప్రజల భయాలను పోగొట్టేందుకు ప్రధాని మోడీ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1971 జనాభా గణాంకాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలని తమిళనాడులోని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. 2001లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఆ మేరకు చేసిన హామీని నిలబెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. 2026 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ అమలు చేస్తే తమిళనాడు సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో న్యాయమైన ప్రాతినిధ్యాన్ని కోల్పోతాయని స్టాలిన్ ఎత్తి చూపారు.






