- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Stalin: ఎన్ఈపీ విద్యా విధానం కాదు, బీజేపీ విధానం.. సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు
ఎన్ఈపీపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. ఇప్పటికే ఈ అంశంపై వివాదం నెలకొనగా స్టాలిన్ మరోసారి వ్యాఖ్యలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP)పై కేంద్రం, తమిళనాడు (Thamilnadu) ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. ఇప్పటికే ఈ అంశంపై తీవ్ర వివాదం నెలకొనగా తమిళనాడు సీఎం స్టాలిన్ (Stalin) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ఈపీ అనేది విద్యావిధానం కాదని అది కాషాయ విధానమని ఆరోపించారు. దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్ఈపీని ప్రవేశపెట్టలేదని కేవలం హిందీని డెవలప్ చేయడానికి మాత్రమే ఉద్దేశించిందని విమర్శించారు. చెన్నయ్‌లో జరిగిన ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) పార్టీ కార్యకర్తల సమావేశంలో స్టాలిన్ ప్రసంగించారు. ఎన్ఈపీతో తమిళనాడు విద్యాభివృద్ధి పూర్తిగా నాశనం అవుతుందని, అందుకే దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
డీలిమిటేషన్ ప్రక్రియతో బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. బీజేపీ తమ ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో ఎంపీల సంఖ్యను పెంచుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. డీఎంకే దానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోదని నొక్కి చెప్పారు. వృత్తి విద్య పేరుతో కేంద్రం కుల ఆధారిత విద్యను ప్రవేశపెట్టడానికి సైతం కసరత్తు చేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను, సమాఖ్య నిర్మాణాన్ని నాశనం చేస్తూ నియంతృత్వం థోరణిని అవలంభిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాలకు మోడీ ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు.






