- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Stalin:1971 సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ చేయాలి.. తమిళనాడు సీఎం స్టాలిన్
కేంద్ర ప్రభుత్వం ఒక వేళ డీలిమిటేషన్ చేస్తే 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఒక వేళ డీలిమిటేషన్ చేస్తే 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్ (Stalin) అన్నారు. 2026 నుంచి 30 సంవత్సరాల పాటు కొనసాగే లోక్‌సభ సీట్ల పునర్విభజనకు 1971 సెన్సస్‌ను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై పార్లమెంటులో హామీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. డీలిమిటేషన్, త్రి భాషా విధానం అంశాలపై చర్చించేందుకు బుధవారం చెన్నయ్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన అన్నాడీఎంకే, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, నటుడు విజయ్ (Vijay) నేతృత్వంలోని తమిళవెట్రి కజగం (టీవీకే) సహా ఇతరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం స్టాలిన్ మాట్లాడారు. పార్లమెంటులో తమిళనాడు ప్రాతినిధ్యాన్ని తగ్గించే చర్యలను కేంద్రం విరమించుకోవాలన్నారు. ఈ మేరకు సమావేశంలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
తమిళనాడు డీలిమిటేషన్‌కు వ్యతిరేకం కాదని, కానీ వివిధ సామాజిక సంక్షేమ పథకాలను అమలు చేసిన రాష్ట్రానికి డీలిమిటేషన్ శిక్షగా ఉండకూడదని నొక్కి చెప్పారు. ఈ సమస్యపై అవగాహన కల్పించేందుకు దక్షిణాది ఎంపీలు ముందుకు రావాలని, దీనిపై దక్షిణాది రాష్ట్రాలు ఉమ్మడి కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయాలని తెలిపారు. తమ డిమాండ్లను ఈ కమిటీ ముందుకు తీసుకెళ్లాలని వెల్లడించారు. మోడీకి తమిళ ప్రజలపై ప్రేమ లేదని అందుకే బలవంతంగా హిందీని రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాల భాషల అభివృద్ధి కోసమే త్రిభాషా సూత్రం అని బీజేపీ చెబుతోందని, అయితే తమిళం, సంస్కృతం భాషలకు నిధుల కేటాయింపులో ఎందుకు వ్యత్యాసం చూపుతోందని ప్రశ్నించారు.






