- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Stalin: ఫేక్ న్యూస్‌తో ప్రమాదం.. ఉదయనిధి స్టాలిన్ హెచ్చరిక
సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ (Udanidi stalin) తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే నా కామెంట్స్‌ను తప్పుగా చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా (Social media) సవాళ్లపై జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తన మాటలను వక్రీకరించి దేశవ్యాప్తంగా వ్యాప్తి చేశారని ఈ దుష్ఫ్రచారంతో నా తలను నరికేయాలనే దాకా పరిస్థితులు వెళ్లాయని తెలిపారు. తప్పుడు సమాచారం చాలా ప్రమాదకరమైందన్నారు. ‘గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2024 తప్పుడు సమాచారాన్ని ప్రపంచానికి రెండో అతిపెద్ద ముప్పుగా పేర్కొంది. రాబోయే రెండేళ్లలో, తప్పుడు సమాచారం ప్రపంచానికి అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తుంది’ అని చెప్పారు.
‘మూడేళ్ల క్రితం నేను ఓ సభలో మాట్లాడుతూ.. అందరూ సమానంగా పుడతారని, పుట్టుకతో ఎవరూ ఉన్నతంగా లేదా తక్కువగా పరిగణించబడరని చెప్పాను. ఇది నిజమైతే, దానిని తొలగించాలి, కానీ దానిని వక్రీకరించారు. నేను జాతి విధ్వంసానికి పిలుపునిచ్చానని పుకార్లు సృష్టించారు’ అని వ్యాఖ్యానించారు. నిజం కంటే రెండింతలు వేగంగా నకిలీ వార్తలు వ్యాపిస్తున్నాయని దీనిని నియంత్రించాలని పిలుపునిచ్చారు.






