శ్రీలంకలో భారత జాలర్లు అరెస్ట్.. కేంద్రానికి సీఎం లేఖ

by Naga Rani Yarlagadda |

భారత్ కు చెందిన జాలర్ల పట్ల శ్రీలంక నేవీ అధికారులు మరోసారి కఠినత్వాన్ని చూపారు.

శ్రీలంకలో భారత జాలర్లు అరెస్ట్.. కేంద్రానికి సీఎం లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ కు చెందిన జాలర్ల పట్ల శ్రీలంక నేవీ అధికారులు మరోసారి కఠినత్వాన్ని చూపారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దును దాటి తమ జలాల్లోకి ప్రవేశించి చేపల వేట చేశారన్న ఆరోపణలతో తమిళనాడుకు చెందిన 14 మంది జాలర్లను అరెస్ట్ చేశారు. జాలర్లకు చెందిన రెండు మర పడవలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సోమవారం (ఆగస్టు 4) రాత్రి శ్రీలంక ఉత్తర ప్రావిన్స్ లోని మన్నార్ సమీపంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

అరెస్టైన మత్స్యకారులు రామేశ్వరం, పాంబన్ కు చెందినవారుగా తెలుస్తోంది. వీరిని నేవీ అధికారులు మన్నార్ లోని ఫిషరీస్ ఇన్ స్పెక్టర్ కు అప్పగించగా.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కాగా.. జాలర్ల అరెస్టుపై సీఎం స్టాలిన్ స్పందించారు. వెంటనే జాలర్లు, వారి పడవలను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్రమంత్రి ఎస్. జైశంకర్ కు లేఖ రాశారు. ఈ సమస్య పదే పదే పునరావృతం అవుతోందని, ఇప్పటికే శ్రీలంక చెరలో 68 మంది భారత జాలర్లు, 235 పడవులు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 185 మంది భారత జాలర్లను శ్రీలంక అరెస్ట్ చేసిందని, 25 పడవల్ని స్వాధీనం చేసుకుందని పేర్కొన్నారు.

Next Story