- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ayodhya: అయోధ్యలో ప్రత్యేక ఆకర్షణగా రాముడికి సాయం చేసిన ఉడుత
రామాయణం(Ramayanam)లో రాముడికి సాయం చేసిన ఉడుత(Squirrel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: రామాయణం(Ramayanam)లో రాముడికి సాయం చేసిన ఉడుత(Squirrel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాముడి బృందం లంకకు వెళ్లే సమయంలో నిర్మించిన వంతెన నిర్మాణానికి ఉడుత తన వంతు సాయం చేసింది. తాజాగా ఆ ఉడుతను అయోధ్య(Ayodhya)లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని అయోధ్య పర్యటనలో జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
‘‘జనవరి 17న మొదటి సారిగా సాధారణ భక్తుల క్యూలో వెళ్లి అయోధ్య రాముణ్ణి దర్శించి పూజించి, ఆశీర్వాదం తీసుకొని అక్కడ ఉన్న ఇతర చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రదేశాలను రెండు రోజుల పాటు సందర్శించి ఈ ఉదయం కుంభమేళాలో పాల్గొనేందుకు వందే భారత్ లో ప్రయగ్రాజ్ బయలుదేరాము. అయోధ్యలో కూల్చిన చోటే రామ మందిర నిర్మాణం చేసి దేశ ప్రజలను జాగృతం చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి హిందువులు ఎప్పటికీ రుణపడి ఉంటారు. రాముడి కోసమే కాకుండా.. అత్యంత క్లిష్ట సమయంలో రాముడికి సాయం చేసిన ఉడుతను కూడా అయోధ్యలో గౌరవించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది’’ అని సోషల్ మీడియా వేదికగా బొలిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు.
జనవరి 17న మొదటి సారిగా సాధారణ భక్తుల క్యూలో వెళ్లి అయోధ్య రాముణ్ణి దర్శించి పూజించి, ఆశీర్వాద ప్రసాదాలు తీసుకొని అక్కడ ఉన్న ఇతర చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రదేశాలను రెండు రోజుల పాటు సందర్శించి ఈ ఉదయం కుంభమేళాలో పాల్గొనేందుకు వందే భారత్ లో ప్రయగ్రాజ్ బయలుదేరాం.. జై శ్రీరామ్..… pic.twitter.com/iDiieCIluH
— Bolisetty Satyanarayana (@bolisetti_satya) January 19, 2025






