- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెస్సి కోల్‌కతా ఇష్యూ.. క్రీడల మంత్రి రాజీనామా
ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి మూడురోజుల పాటు భారత్ లో పర్యటించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి మూడురోజుల పాటు భారత్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే మెస్సి కోల్‌కతా పర్యటన సందర్భంగా స్టేడియంలో అభిమానులు కుర్చీలు విసిరిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై బెంగాల్ ప్రభుత్వం దర్యాప్తు చేస్తుండగా.. నేడు ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో రాష్ట్ర క్రీడల మంత్రి అరూప్ బిశ్వాస్ తన పదవికి రాజీనామా చేశారు.
స్టేడియంలో జరిగిన అవాంఛనీయ ఘటనపై న్యాయంగా, పారదర్శకంగా విచారణ జరగాలనే ఉద్దేశంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాజీనామా లేఖను పంపినట్లు కూడా ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా.. తాజాగా రాష్ట్ర డీజీపీ, సీఎస్ సహా పలువురు అధికారులకు నోటీసులు జారీ చేశారు. జరిగిన గందరగోళంపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది ప్రభుత్వం.






