- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పైస్‌జెట్ విమానానికి తప్పిన పెను ప్రమాదం.. రన్ వేపై టైరు లేకుండానే ల్యాండింగ్
స్పైస్ జెట్ విమానానికి తప్పిన పెను ప్రమాదం తప్పింది.

దిశ, డైనమిక్ బ్యూరో: స్పైస్ జెట్ (SpiceJet) విమానానికి తప్పిన పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం గుజరాత్‌లోని కాండ్లా విమానాశ్రయం నుంచి ముంబై వెళ్తున్న స్పైస్ జెట్ విమానం టైరు ఊడిపడింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Chhatrapati Shivaji Maharaj International Airport)లో పైలట్స్ చాకచక్యంతో రన్ వేపై టైరు లేకుండానే సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో విమానంలో 80 మంది ఉన్నట్లు సమాచారం.
ఇక ఈ సంఘటనపై స్పైస్ జెట్ ప్రతినిధి మాట్లాడుతూ.. కాండ్లా నుంచి ముంబైకి వస్తున్న స్పైస్‌జెట్ Q400 విమానం టైరు టేకాఫ్ సమయంలో ఊడిపడింది. అయితే విమానం ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులు అందరూ సేఫ్‌గా ఉన్నారని తెలిపారు. సంఘటనపై పైలట్ ల్యాండింగ్‌కు 20 నిమిషాల ముందు అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం అందించారని DGCA వర్గాలు తెలిపాయి. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం.






