మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని స్పెషల్ ట్రీట్‌

by velandi.Saikiran |   (  Updated:2026-02-25 23:54:59  IST  )

రాత్రి విందు కంటే ముందుఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యహు కూడా ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్సులు ధరించి మన మోడీకి ట్రీట్‌ ఇచ్చారు.

మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని స్పెషల్ ట్రీట్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ప్రస్తుతం ఇజ్రాయెల్ ( Israel) పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతాన్యహు స్పెషల్ ట్రీట్‌ ఇచ్చారు. రాత్రి విందు కంటే ముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్సులు ధరించి మన మోడీకి షాక్ ఇచ్చారు. నా స్నేహితుడు ప్రధాని నరేంద్ర మోడీ కోసం ఈ డ్రెస్ వేసుకున్నానంటూ సోషల్ మీడియాలో వీడియోను కూడా షేర్ చేశారు ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతాన్యహు. అంతకు ముందు ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టించాడు. ఉగ్రవాదం పై పోరులో ఇరుదేశాలు ఏకతాటిపై ఉంటాయని వెల్లడించారు. ఇజ్రాయెల్ కు, ఇండియాకు మంచి సంబ‌ధాలు ఉన్నాయ‌న్నారు.

అమెరికన్ కాదని ఇండియాకు ఇజ్రాయిల్ సహాయం

దౌత్య సంబంధాలు లేని 1971లోనే అమెరికాను ఎదిరించింది ఇజ్రాయెల్. అలా అమెరికాను ఎదిరించి మరీ, ఇండియాకు రహస్యంగా ఆయుధాలు, శిక్షణ అందించింది ఇజ్రాయెల్. 1980 లో పాక్ అను కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇక ఇటీవల ఆపరేషన్ సిందూర్ కు ఇజ్రాయెల్ పూర్తి మద్దతు ప్రకటించింది. ఐక్యరాజ్యసమితిలో వాషింగ్టన్ కంటే ఢిల్లీని ఎక్కువగా నమ్ముతామని బెంజమిన్ నెతన్యాహు కూడా గతంలో ప్రకటన చేశారు. రక్షణ వ్యవసాయం ఏఐ అన్ని రంగాల్లో కూడా ఇండియాకు సహకారాలు అందిస్తున్నారు.

Next Story