అందరికీ చాన్స్.. అవిశ్వాస తీర్మానం అనంతరం తొలిసారి ఓం బిర్లా కామెంట్స్

by Prasad Jukanti |   (  Updated:2026-03-12 09:09:06  IST  )

అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తర్వాత లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు చేశారు.

అందరికీ చాన్స్.. అవిశ్వాస తీర్మానం అనంతరం తొలిసారి ఓం బిర్లా కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సభా నియమాలకు కట్టుబడి అందరికీ అవకాశాలు కల్పిస్తున్నట్లు లోక్ సభ (Lok Sabha Speaker) స్పీకర్ ఓం బిర్లా (Om Birla) అన్నారు. సభలో విపక్షాలు మాట్లాడితేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందన్నారు. స్పీకర్‍పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (No-Confidence Motion) నేపథ్యంలో ఆయన సభకు దూరంగా ఉన్నారు. నిన్న మూజువాణి ఓటుతో ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో ఇవాళ స్పీకర్ స్థానానికి తిరిగి వచ్చిన ఆయన ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై 12 గంటలకుపైగా చర్చ జరిగింది. నిష్పాక్షికంగా, నిబంధనల ప్రకారమే సభను నడిపేందుకు ప్రయత్నించానన్నారు. ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వడం లేదని కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ నిబంధనల ప్రకారం సభ్యులు మాట్లాడేందుకు సమయం ఇస్తున్నానన్నారు.

నా దగ్గర ఎలాంటి బటన్స్ ఉండవు

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవని నిబంధనల ప్రకారమే కార్యకలాపాలు నడుస్తాయన్నారు. ప్రధాని, మంత్రులు కూడా ఏదైనా ప్రకటనలు చేయడానికి ముందు సభ నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వాలన్నారు. మైక్రోఫోన్లు ఆన్‌ లేక ఆఫ్ చేయడానికి స్పీకర్ వద్ద ఎలాంటి బటన్ ఉండదు. ఈ విషయం విపక్ష నేతలకు కూడా తెలుసని అన్నారు. మాట్లాడేందుకు అనుమతి ఉన్న సభ్యుడికి మాత్రమే మైక్రోఫోన్ ఆన్ అవుతుందని చెప్పారు.

Next Story