- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SpaceX: స్పేస్ ఎక్స్ కు మరోషాక్.. వరుసగా మూడోసారి ప్రయోగం ఫెయిల్
ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కు మరో షాక్ తగిలింది. సుదూర అంతరిక్ష యాత్రల కోసం స్పేస్ ఎక్స్ రూపొందింన స్టార్‌షిప్ మెగా రాకెట్ (SpaceX Starship) మళ్లీ ఫెయిల్ అయ్యింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కు మరో షాక్ తగిలింది. సుదూర అంతరిక్ష యాత్రల కోసం స్పేస్ ఎక్స్ రూపొందింన స్టార్‌షిప్ మెగా రాకెట్ (SpaceX Starship) మళ్లీ ఫెయిల్ అయ్యింది. ప్రయోగం ప్రారంభమైన వెంటనే రాకెట్ నింగిలోకి విజవంతంగానే దూసుకెళ్లింది. కానీ, అరగంట తర్వాత అది గాల్లోనే పేలిపోయింది. అయితే, స్టార్ షిప్ రాకెట్ ఇలా పేలడం వరుసగా ఇది మూడోసారి. అమెరికా స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 7.36 గంటలకు టెక్సాస్ (Texas)లోని బ్రౌన్స్‌విల్ తీరంలోని వేదిక నుంచి స్పేస్‌ఎక్స్ దీన్ని (Starship Mega Rocket) ప్రయోగించింది. రీయూజ్ చేసేందుకు వీలుగా అభివృద్ధి చేసిన 123 మీటర్ల పొడవైన ఈ భారీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. కొన్ని నిమిషాల తర్వాత తొలిదశలో బూస్టర్ ఈ రాకెట్ నుంచి విడిపోయి భూమికి దిశగా ప్రయాణం మొదలుపెట్టింది. కానీ, స్పేస్‌ఎక్స్ (SpaceX) కంట్రోలర్స్‌కు బూస్టర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ప్రణాళిక ప్రకారం.. నియంత్రిత్వ రీతిలో భూమిని తాకకుండా.. సముద్రంలో పడిపోయింది.
స్టార్ షిప్ ప్రయాణం..
మరోవైపు, స్టార్‌షిప్ తన ప్రయాణాన్ని కొనసాగించి.. అంతరిక్షాన్ని చేరుకుంది. కానీ, నిర్ణీత కక్ష్యలోకి చేరుకున్న తర్వాత స్టార్‌షిప్ పేలోడ్‌లోని శాటిలైట్లను ప్రవేశపెట్టేందుకు వీలుగా తలుపులు తెరుచుకోలేదు. దాదాపు అరగంట తర్వాత స్టార్‌షిప్ కూడా నియంత్రణ కోల్పోయింది. ఆ తర్వాత అదుపుతప్పి భూ వాతావరణంలోకి ప్రవేశించింది. కాసేపటికే హిందూ మహాసముద్రంలో కుప్పకూలింది. దీనిపై స్పేస్‌ఎక్స్ స్పందించింది. దీని నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపింది. ఇకపోతే, స్టార్‌షిప్ మెగా రాకెట్ పేలిపోవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది జనవరి, మార్చిలో చేపట్టిన ప్రయోగాల్లోనూ ఈ భారీ రాకెట్లు గాల్లోనే పేలిపోయాయి. అయితే, గత రెండు సార్ల కంటే ఈ దఫా రాకెట్ ఎక్కువ దూరం ప్రయాణించిందని స్పేస్‌ఎక్స్ వెల్లడించింది.






