- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
South korea: దక్షిణ కొరియాలో ఎల్డీపీదే గెలుపు.. ఎగ్జిట్ పోల్స్ అంచనా
దక్షిణ కొరియాలో నెలల తరబడి కొనసాగిన రాజకీయ గందరగోళానికి తెరపడింది. అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది.

దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణ కొరియా (South korea) లో నెలల తరబడి కొనసాగిన రాజకీయ గందరగోళానికి తెరపడింది. అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ తమ అంచనాలను వెల్లడించాయి. దీని ప్రకారం.. వామపక్ష లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) అభ్యర్థి లీజే మ్యూంగ్ భారీ ఆధిక్యంతో గెలుస్తాయని అంచనా వేశాయి. మ్యూంగ్‌కు 51.7 శాతం ఓట్లు, అధికార పీపుల్ పవర్ పార్టీ (పీపీపీ) కిమ్ మూన్ సూకు 39.3 శాతం ఓట్లు, మైనారిటీ పార్టీకి చెందిన లీ జున్-సియోక్ కు 7.7శాతం ఓట్లు వస్తాయని తెలిపాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారమే ఫలితాలు వస్తే లీజే మ్యూంగ్ తదుపరి అధ్యక్షుడు అయ్యే చాన్స్ ఉంది. బుధవారం ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా గెలిచిన అభ్యర్థి అదే రోజు ప్రెసిడెంట్ గా ప్రమాణం చేస్తారు. కాగా, సౌత్ కొరియా అధ్యక్ష ఎన్నికల్లో 78.3శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1997 తర్వాత ఇదే అత్యధికమని అక్కడి అధికారులు తెలిపారు.






