Kumbha Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు సికింద్రాబాద్‌ నుంచి స్పెషల్ ట్రైన్..టికెట్ ధర ఎంతంటే?

by Vennela |

Kumbha Mela 2025: కుంభమేళా(Kumbha Mela 2025)కు వెళ్లే భక్తులకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక రైలును ప్రకటించింది.

Kumbha Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు సికింద్రాబాద్‌ నుంచి స్పెషల్ ట్రైన్..టికెట్ ధర ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్: Kumbha Mela 2025: కుంభమేళా(Kumbha Mela 2025)కు వెళ్లే భక్తులకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక రైలును ప్రకటించింది. ఫిబ్రవరి 15వ తేదీన ఈ స్పెషల్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి బయలుదేరి తిరిగి 22వ తేదీన హైదరాబాద్ నగరానికి చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఎంతో వైభవంగా సాగుతున్న కుంభమేళా(Kumbha Mela 2025)కు వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. భక్తుల సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్(South Central Railway Special Train) ను ప్రకటించింది. ఫిబ్రవరి 15వ తేదీన ఈ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి తిరిగి అదే నెల 22వ తేదీన హైదరాబాద్ నగరానికి చేరుకుంటుంది. మొత్తం 8 రోజుల పాటు సాగే ఈ యాత్రలో వారణాసి, అయోధ్య, ప్రయాగ్ రాజ్ లను దర్శించుకునేందుకు వీలుగా ఐఆర్ సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ(IRCTC special package)ని రూపొందించింది. ఎకానమీ క్లాసులో పెద్దలకు రూ. 23, 035, 11ఏళ్ల లోపు పిల్లలకు రూ. 22, 140గా టికెట్ ఛార్జీలను నిర్ణయించింది. 15వ తేదీన సికింద్రాబాద్ లో బయలుదేరే రైలు 18న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు చేరుకుంటుంది.

19వ తేదీన వారణాసిలో కాశీవిశ్వనాథ్(Kashi Vishwanath), కాశీ విశాలక్షి(Kashi Visalakshi), అన్నపూర్ణదేవి(Annapurnadevi) ఆలయాలను భక్తులు దర్శించుకున్న తర్వాత అదే రోజు ప్రయాణికులు అక్కడ బస చేస్తారు. తర్వాత 22వ తేదీన అయోధ్యకు చేరుకుంటారు. అక్కడ శ్రీరామ జన్మభూమి హనుమాన్ గర్హి(Hanumangarhi, the birthplace of Shri Rama)ని సందర్శించుకున్న తర్వాత రైలు తిరిగి హైదరాబాద్ కు ప్రారంభం అవుతుంది. 22న రాత్రి వరకు సికింద్రాబాద్ కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

కాగా ఈ రైలు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, ఏలూరు, దువ్వాడ, తుని, పెందుర్తి, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ , పలాస, బ్రహ్మపూర్, చత్రపూర్, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసూర్ స్టేషన్లో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

Next Story