- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maha Kumbh: అయ్యో దేవుడా! మహాకుంభ మేళాలో వృద్ధ తల్లిదండ్రులను వదిలేసిన కుమారులు
కొంత మంది తమను కనీ పెంచిన తల్లిదండ్రులకు ముసలి తన వచ్చాక వారిని వృద్ధాశ్రమాల్లో చేర్పించడం చూసే ఉంటారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కొంత మంది తమను కనీ పెంచిన తల్లిదండ్రులకు ముసలి తన వచ్చాక వారిని వృద్ధాశ్రమాల్లో చేర్పించడం చూసే ఉంటారు. వృద్ధ తల్లిదండ్రులకు చెందిన ఆస్తిని కాజేసి వారిని బయటకు గెంటేసిన కొన్ని ఘటనలు కళ్ల ముందు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాలో వృద్ధ దంపతులను వదిలివెళ్లిన హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. రాత్రి సమయంలో చలిలో వణుకుతున్న ఓ వృద్ధ జంటను చూసిన కొందరు వ్యక్తులు చూసి వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తారు. తమ పిల్లలు మమ్మల్ని ఇలా ఇక్కడే వదిలేసి వెళ్లిపోయారని వృద్ధ జంట వారికి చెబుతారు.
వీడియోలో ప్రకారం.. వారిలో ఒక వ్యక్తి వృద్ధ జంటకు కొంత డబ్బు ఇస్తాడు. నేను ఇక్కడికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటాను.. ఈ డబ్బు ఉంచుకో.. పొద్దున్నే వచ్చి ఆశ్రమానికి తీసుకెళ్తానని హామీ ఇస్తాడు. మరోవైపు అతను ఆ వృద్ధ జంట వివరాలు అడిగే ప్రయత్నం చేస్తాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు పిల్లలు ఉన్నారా? అని అడుగుతారు? అప్పుడు పెద్దాయన మాట్లాడుతూ.. మేమిద్దరం ఉదయం వరకు ఇక్కడే ఉంటాం. మాకు ముగ్గురు కోడళ్ళు చాలా వేదిస్తుంది.. చాలా దుర్మార్గులని వృద్ధుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. భర్త మాటలు విని ముసలి తల్లి కన్నీరుమున్నీరవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను శివం బికనేరి అఫీషియల్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ వేదిక పోస్ట్ చేశారు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. దేశంలో వృద్ధ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే కుమారులు చాలా మంది ఉన్నారని కొంతమంది కామెంట్ రూపంలో వారి ఆవేదన తెలియజేశారు. అయ్యో దేవుడా.. అలాంటి పిల్లలను ఎవరికీ ఇవ్వకు అంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు.






