Sonia Gandhi: రాత్రి ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ.. హెల్త్‌ బులిటెన్‌ విడుదల

by Ramesh Naini |   (  Updated:2025-06-16 08:42:37  IST  )

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (78) ఆరోగ్యం నిలకడగా ఉందని గంగారామ్ ఆసుపత్రి వైద్య బృందం తెలిపింది.

Sonia Gandhi: రాత్రి ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ.. హెల్త్‌ బులిటెన్‌ విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అధినేత్రి (Sonia Gandhi) సోనియా గాంధీ (78) ఆరోగ్యం నిలకడగా ఉందని గంగారామ్ (Ganga Ram Hospital) ఆసుపత్రి వైద్య బృందం తెలిపింది. ఈ మేరకు అస్పత్రి వర్గాలు సోనియా గాంధీ హెల్త్‌ బులిటెన్‌‌ను విడుదల చేశారు. ఆమె ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని ఆసుపత్రి చైర్మన్ సోమవారం తెలిపారు. నిన్న (ఆదివారం) రాత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురవ్వడంతో ఆమెను వ్యక్తిగత సహాయక సిబ్బంది ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుప్రతిలో చేర్పించారు. కొన్నాళ్లుగా సోనియా ఉదర సంబంధిత సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

గంగా రామ్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ మాట్లాడుతూ.. ‘సోనియా గాంధీని ఉదర సంబంధిత సమస్య కారణంగా సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం కింద నిన్న (ఆదివారం) రాత్రి 9 గంటలకు గంగా రామ్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది, వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు’ అని తెలిపారు. కాగా, జూన్ 7న ఆమె స్వల్ప ఆరోగ్య సమస్యలతో షిమ్లాలోని ఇందిరా‌ గాంధీ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. ఈ మేరకు సోనియాకు వైద్యులు జనరల్ మెడికల్ చెకప్ చేసిన విషయం తెలిసిందే.

Next Story