- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
14 కోట్ల మందికి ఆహార భద్రత కరువు
2013 సెప్టెంబర్‌లో అప్పటి యూపీఏ ప్రభుత్వం 140 కోట్ల మంది ప్రజలకు సరైన ఆహార ధాన్యాలు, పోషకాహారం లభించాలనే లక్ష్యంతో జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొని వచ్చిందని గుర్తు చేశారు.

- ఆహార భద్రత ప్రజల ప్రాథమిక హక్కు
- జనగణన వెంటనే చేపట్టండి
- 2011 జనాభా లెక్కల ప్రకారమే కేటాయంపులు
- ఆహార భద్రత చట్టం తీసుకొచ్చింది మేమే
- రాజ్యసభలో ఎంపీ సోనియా గాంధీ
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో 14 కోట్ల మంది అర్హులైన పేదలకు ఆహార భద్రత కరువైంది. జాతీయ ఆహార భద్రత చట్ట ప్రకారం చౌక ధరలకే వీరికి ఆహార ధాన్యాలు అందించాల్సి ఉంది. కానీ జనగణన చేపట్టకపోవడంతో వారు తమ హక్కును కోల్పోతున్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీ అన్నారు. రాజ్యసభలో జీరో అవర్‌లో ప్రసంగించిన సోనియా గాంధీ సాధ్యమైనంత త్వరగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. సరైన సమయంలో సెన్సెస్ చేపట్టకపోవడం వల్ల దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది అర్హులైన ప్రజలు ఫుడ్ సెక్యూరిటీ చట్టం కింద తమ ప్రయోజనాలను పొందలేకపోతున్నారని ఆమె చెప్పారు. ప్రస్తుతం జాతీయ ఆహార భద్రత చట్టం కింద అర్హులైన వారిని 2011 జనాభా లెక్కల ప్రకారమే గుర్తిస్తున్నారు. తాజా లెక్కలు అందుబాటులో లేకపోవడంతో చాలా మంద నష్టపోతున్నారని చెప్పారు. 2013 సెప్టెంబర్‌లో అప్పటి యూపీఏ ప్రభుత్వం 140 కోట్ల మంది ప్రజలకు సరైన ఆహార ధాన్యాలు, పోషకాహారం లభించాలనే లక్ష్యంతో జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొని వచ్చిందని గుర్తు చేశారు.
కోవిడ్-19 సమయంలో ఈ చట్టమే లక్షలాది గృహాలు ఆకలిక అలమటించకుండా దూరం చేసిందని చెప్పారు. అయితే దశాబ్దానికి పైగా పాతవైన సెన్సెస్-2011 లెక్కలనే ఇప్పటికీ వాడుతూ, వాటి ప్రకారమే కేటాయింపులు చేస్తున్నారని విమర్శించారు. నేషనల్ ఫుడ్ సెక్యూరటీ యాక్ట్ 2013 వల్ల గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం మంది, అర్బన్ ప్రాంతాల్లో 50 శాతం మంది జనాభాకు అతి తక్కువ ధరలకే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. అయితే 2011లో ఉన్న 81.35 కోట్ల జనాభా మేరకే కేటాయింపులు చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం మనిషికి 5 కేజీల ఆహార ధాన్యాలను ఆహార భద్రత చట్టం ద్వారా సరఫరా చేస్తోంది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్ట మొదటి సారి జనగణన నాలుగేళ్ల పాటు ఆలస్యమైందన సోనియా గాంధీ చెప్పారు. 2021లో నిర్వహించాల్సిన జనగణను ఇప్పటికీ ఎందుకు మొదలు పెట్టలేదో అనే అంశంపై స్పష్టత లేదని ఆమె మండిపడ్డారు.
బడ్జెట్ కేటాయింపులు చూసిన తర్వాత ఈ ఏడాది కూడా సెన్సెస్ నిర్వహిస్తారనే నమ్మకం లేదని చెప్పారు. ఇప్పటికే 14 కోట్ల మంది అర్హులైన ప్రజలకు ఆహార ధాన్యాలు, ఇతర ప్రయోజనాలు అందడం లేదని చెప్పారు. ఆహార భద్రత అనేది ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక ప్రయోజనం కాదు.. అది ప్రజల ప్రాథమిక హక్కు అని సోనియా గాంధీ అన్నారు. సాధ్యమైనంత త్వరగా సెన్సెస్‌ను చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.






