Sonia Gandhi: నిలకడగానే సోనియా గాంధీ ఆరోగ్యం.. గంగారామ్ ఆస్పత్రి ప్రకటన

by B.Srinivas |

ఉదర సంబంధింత సమస్యలతో బాధపడుతున్న సోనియా గాంధీ ఇటీవల సర్ గంగారామ్ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన విషయం తెలిసిందే.

Sonia Gandhi: నిలకడగానే సోనియా గాంధీ ఆరోగ్యం.. గంగారామ్ ఆస్పత్రి ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉదర సంబంధింత సమస్యలతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) ఇటీవల ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి (Sir gangaram Hospital) లో అడ్మిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు అప్ డేట్ ఇచ్చాయి. సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆమెకు చికిత్స జరుగుతోందని ఆస్పత్రి చైర్మన్ అజయ్ స్వరూప్ తెలిపారు. సోనియా గాంధీ ట్రీట్‌మెంట్‌కు బాగా స్పందిస్తున్నారని, కడుపులో ఇన్ఫెక్షన్ నుంచి క్రమంగా కోలుకుంటున్నారని వెల్లడించారు. ఆమె ఆహారాన్ని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. అయితే ముందు జాగ్రత్తగా డిశ్చార్జ్ తేదీ ఇంకా ఖరారు చేయలేదని స్పష్టం చేశారు. డాక్టర్ ఎస్ నంది, డాక్టర్ అమితాబ్ యాదవ్ పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. కాగా, ఈ నెల 15న స్వల్ప అస్వస్థతకు గురికావడంతో సోనియా ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు.

Next Story