మరోసారి అస్వస్థతకు గురైన సోనియా గాంధీ.. ఆసుపత్రికి తరలింపు

by Kema Shiva Kumar |

కాంగ్రెస్ (Congress) అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) కాసేపటి క్రితం మరోసారి అస్వస్థతకు గురయ్యారు.

మరోసారి అస్వస్థతకు గురైన సోనియా గాంధీ.. ఆసుపత్రికి తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ (Congress) అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) కాసేపటి క్రితం మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు ఆమెను వ్యక్తిగత సహాయక సిబ్బంది ఢిల్లీ (Delhi)లోని గంగారామ్ (Gangaram) ఆసుపత్రిలో చేర్పించారు. కొన్నాళ్లుగా సోనియా ఉదర సంబంధిత సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. ప్రస్తుతం వైద్యల పర్యవేక్షణలో ఆమెకు చికిత్సను అందజేస్తున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని గంగారామ్ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటిన్ విడుదల చేశాయి. కాగా, జూన్ 7న ఆమె స్వల్ప ఆరోగ్య సమస్యలతో షిమ్లాలోని ఇందిరా‌ గాంధీ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. ఈ మేరకు సోనియాకు వైద్యులు జనరల్ మెడికల్ చెకప్ చేసిన విషయం తెలిసిందే.

Next Story