- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసుపత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్
by Muthe.Rajitha |
ఇంట్లోనే పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

X
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ సోమవారం తెల్లవారు జామున ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఛాతిలో ఇన్ఫెక్షన్, వెన్నుముక తదితర సమస్యలతో గత వారం జనవరి 5న సోనియా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అక్కడ వైద్యులు మందులు, ఫిజియోథెరపీ చికిత్స అందించగా.. సోనియా పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇంట్లోనే పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. సోనియా గాంధీ పూర్తిగా కోలుకొని, ఆరోగ్యంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు.
Next Story






