నేనే చంపించా.. సిట్ ముందు భోరున ఏడుస్తూ నేరం ఒప్పుకున్న సోనమ్!

by Phanindra |

నేనే చంపించా.. సిట్ ముందు భోరున ఏడుస్తూ నేరం ఒప్పుకున్న సోనమ్! హనీమూన్ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు.

నేనే చంపించా.. సిట్ ముందు భోరున ఏడుస్తూ నేరం ఒప్పుకున్న సోనమ్!
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీ నేరం ఒప్పుకుంది. తన భర్తను తనే ప్లాన్ చేసి హత్య చేయించినట్లు అంగీకరించింది. భర్తతో కలిసి హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన ఆమె.. అక్కడి నుంచి కనిపించకుండా పోయి సడెన్‌గా యూపీలోని ఘాజీపూర్‌లో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన తర్వాత పోలీసులకు సోనమ్ ఆచూకీ తెలిసింది. ఘాజీ పూర్ నుంచి షిల్లాంగ్‌కు తీసుకెళ్లేంతసేపూ పోలీసులతో సోనమ్ ఏమీ మాట్లాడలేదట.


స్టేషన్‌కు వెళ్లిన తర్వాత కూడా కొందరు దొంగతనం చేసే ప్రయత్నంలో తన భర్తను చంపేశారని, అక్కడి నుంచి తాను పారిపోయానని ఆమె బుకాయించినట్లు సమాచారం. అయితే రాజా రఘువంశీ మరణం తర్వాత హంతకులను ఆమె కలిసిన ఫుటేజీని, హత్యాస్థలంలో దొరికిన దుస్తులు, నిందితుల స్టేట్‌మెంట్లు, ఆమె ఫోన్ కాల్స్, మెసేజీలు.. అన్నీ ఆమె ముందుంచిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) హత్య ఎలా జరిగిందో కూడా టైంలైన్ వివరించారు. దీంతో తను తప్పించుకునే అవకాశం లేదని అర్థం చేసుకున్న సోనమ్.. భోరున ఏడుస్తూ నేరం ఒప్పుకున్నట్లు సమాచారం. హత్యలో సోనమ్ పాత్రను స్పష్టంగా వివరించే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు తెలిపారు.

Next Story