- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bhopal : లిఫ్ట్ లో ఇరుకున్న కొడుకు.. గుండె పోటుతో తండ్రి మృతి
మధ్యప్రదేశ్(MP) రాజధాని భోపాల్(Bhopal)లో మంగళవారం రాత్రి ఓ విషాద ఘటన చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్(MP) రాజధాని భోపాల్(Bhopal)లో మంగళవారం రాత్రి ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. భోపాల్‌లోని జట్‌ఖేడి ప్రాంతంలోని రాయల్ పామ్ విల్లా కాలనీలో 51 ఏళ్ల రిషిరాజ్ భట్నాగర్ అనే వ్యక్తి భార్య, ఇద్దరు కుమారులతో కలిసి మూడో అంతస్తులో నివసిస్తున్నారు. రాత్రి భోజనం తర్వాత రిషిరాజ్ కిందకు నడవడానికి వెళ్లారు. అక్కడ తన 8 ఏళ్ల చిన్న కుమారుడు ఆడుకుంటుండడం చూసి, ఇంటికి వెళ్లమని చెప్పారు. చిన్నకుమారుడు దేవాంశ్ లిఫ్ట్‌లో ఎక్కగా, కొన్ని క్షణాల్లోనే విద్యుత్ సరఫరా ఆగిపోయింది.
దీంతో లిఫ్ట్ ఆగిపోయి, దేవాంశ్ లోపల ఇరుక్కుపోయాడు(Son Stuck in Elevator). లిఫ్ట్ నుంచి "పాపా... పాపా..." అని దేవాంశ్ కేకలు వినిపించాయి. భయంతో రిషిరాజ్ వెంటనే సెక్యూరిటీ గార్డ్ రూమ్‌కి పరుగెత్తి, జనరేటర్ ఆన్ చేయమని, లిఫ్ట్ తాళం తెరిచే కీలు తీసుకురమ్మని చెప్పారు. ఆ తొందరలో 25-30 అడుగులు నడిచిన తర్వాత ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సుమారు మూడు నిమిషాల్లో జనరేటర్ ద్వారా విద్యుత్ సరఫరా పునరుద్ధరించగా, దేవాంశ్ క్షేమంగా లిఫ్ట్ నుంచి బయటకు వచ్చాడు.
కానీ అప్పటికే రిషిరాజ్ అపస్మారక స్థితిలో ఉన్నారు. పెద్ద కుమారుడు, కొందరు ఇరుగుపొరుగు వారి సహయంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, విచారణ చేపట్టారు.






