- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడులో షాకింగ్ ఘటన.. తండ్రి మృతదేహం ముందే కుమారుడి పెళ్లి..!
తమిళనాడులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కడలూర్ జిల్లాలోని కవణై గ్రామంలో తండ్రి శవం ముందే ఓ యువకుడు పెళ్లి చేసుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కడలూర్ జిల్లాలోని కవణై గ్రామంలో తండ్రి శవం ముందే ఓ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. గ్రామానికి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి సెల్వరాజ్ శుక్రవారం అనారోగ్యం మరణించాడు. అతడి కుమారుడు అప్పు ప్రస్తుతం లా చదువుతుండగా డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్న విజయశాంతి అనే అమ్మాయిని ప్రేమించాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడే పెళ్లి వద్దని జీవితంలో స్థిరపడిన తరవాత పెళ్లి చేసుకోవాలని భావించారు. భవిష్యత్‌లో వీరి పెళ్లికి పెద్దలు కూడా ఒప్పుకున్నారు.
కానీ ఇంతలోనే విధి వెక్కిరించింది. అప్పు తండ్రి సెల్వరాజ్ చనిపోయాడు. తన పెళ్లిని తండ్రి చూడాలనుకున్న అప్పు కనీసం అతడి అంత్యక్రియల సమయంలో మృతదేహం ముందు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇదే విషయాన్ని తన ప్రేయసికి చెప్పగా ఆమె కూడా అంగీరించింది. ఆమె కుటుంబ సభ్యులు సైతం కూతురు ఇష్టాన్ని గౌరవించారు. ఓ వైపు అంత్యక్రియలు జరుగుతుండగానే అప్పు తన ప్రేయసి మెడలో తాలికట్టి తండ్రి ఆశీర్వాదం తీసుకున్నాడు. చావుకు వచ్చినవాళ్లంతా తీవ్రమైన దుఃఖంలోనే అప్పు వివాహాన్ని చూసి వారిని ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






